చల్లారని మంటలు : కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత టి.కాంగ్రెస్ లో రాజుకున్న రాజకీయ వేడి ఇంకా చల్లారినట్టు కనిపించడంలేదు.అందుకే ఇంకా ఆ ఫలితాలనే తలచుకుని కాంగ్రెస్ నాయకులు తప్పు మీదంటే మీది అంటూ వదలాడుకుంటున్నారు.తాజాగా…హైదరాబాద్‌ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు.ఒకరిపై మరొకరు కుర్చీలతో దాడులు చేసుకున్నారు.దీంతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం కాస్తా రసాభాసగా మారింది.

 Congress Leaders Fight Against Other In Gandhi Bhavan-TeluguStop.com

తెలంగాణ సీఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన భట్టి విక్రమార్కకు ఈరోజు మధ్యాహ్నం గాంధీ భవన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తునే తరలివచ్చారు.సన్మాన కార్యక్రమం అనంతరం పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, ఓబీసీ సెల్ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి.శ్రీకాంత్‌కు టికెట్‌ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపిస్త్గూ శ్రీకాంత్ వర్గీయులు వీహెచ్‌ను అడ్డుకున్నారు.వీహెచ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.బీసీలకు అన్యాయం చేస్తున్నారని వీహెచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇరువర్గాల కార్యకర్తలు కాంగ్రెస్ పెద్దల సమక్షంలోనే పరస్పరం దాడులకు దిగి రచ్చ రచ్చ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube