కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం ? ఎవరూ ఊహించలేదుగా ?

తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.ఎప్పుడూ లేని ధీమా వ్యక్తం అవుతోంది.

 Congress Leaders Are Happy That Rewant Reddy- S The Pcc Presiden Revanth Reddy,-TeluguStop.com

ఇదంతా పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తుండడమే.అసలు పిసిసి చీఫ్ కంటే పెద్ద స్థాయిలోనే రేవంత్ బాధ్యతలు స్వీకరించినట్లుగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు హడావుడి చేస్తున్నారు.

పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.అసలు ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరూ ఊహించనివే.

తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ వైభవం కోల్పోయిందని అనుకుంటున్న సమయంలో రేవంత్ హడావుడి చేస్తూ, ఏదో ఒక అంశంపై పోరాడుతూ ఉండే వారు.ఈ క్రమంలోనే ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు ప్రయత్నించినా అవేవీ వర్క్ అవుట్ కాలేదు.

అయితే పిసిసి ప్రకటన వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ సీనియర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కేవారు.రేవంత్ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదు అంటూ ప్రకటనలు చేసినా, రేవంత్ రెడ్డికి వస్తున్న క్రేజ్ , పార్టీ కేడర్ లో పెరిగిన ధీమా ఇవన్నీ లెక్కల్లో తీసుకున్న సీనియర్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.

రేవంత్ నాయకత్వంలోని తాము పని చేస్తానంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు.ఇక కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి అయిన బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు సైతం ఇప్పుడు ఆందోళనలోనే ఉన్నాయి.

ఇప్పటి వరకు ఆ పార్టీని లెక్కలోకి తీసుకోనట్టుగా వ్యవహరించినా, పీసీసీ బాధ్యతలు అప్పగించడంతో కాంగ్రెస్ కూడా తమకు ప్రధాన పోటీదారే అనే అభిప్రాయం ఆ పార్టీల్లోనూ కనిపిస్తోంది.

Telugu Congress, Jagga, Komati Venkata, Pcc, Rahul Gandi, Revanth Reddy, Sonia-T

ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు ప్రధాన ఆకర్షణగా రేవంత్ మారిపోయారు.త్వరలోనే పాదయాత్ర చేపట్టి తెలంగాణ అంతటా తిరగడమే కాకుండా కాంగ్రెస్ కు ఆదరణ పెరిగేలా టిఆర్ఎస్ ప్రభుత్వంను హైలెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు.ఇలా ఏదో ఒక అంశంతో నిత్యం రేవంత్ జనాల మధ్య ఉంటూ, పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అనే నమ్మకం కాంగ్రెస్ లీడర్లు పెరగడంతోనే రేవంత్ ప్రమాణస్వీకారానికి ఇంత భారీ స్థాయిలో స్పందన కనిపిస్తోంది.

పిసిసి అధ్యక్ష బాధ్యతలు రేవంత్ కు కాకుండా మరి ఎవరికి ఇచ్చినా ఇంత ఉత్సాహం అయితే కనిపించేది కాదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube