రాములమ్మ తో పాటు వీరంతా..? బీజేపీలోకి ముహూర్తం ఇదేనా ?

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అన్నీ బీజేపీకి బాగా కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.ఒకపక్క అధికార పార్టీ టిఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడం,  ఎదురుగాలి వీస్తూ ఉండడం, అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింతగా బలహీనం కావడం , ఇవన్నీ బీజేపీకి వరంగా మారాయి.మొన్నటి వరకు అంతంత మాత్రం గా ఉన్న బీజేపీ పరిస్థితి మెరుగైనట్టుగా కనిపిస్తోంది.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు సంపాదించడం, తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం జరగడం ,ఇలాంటి పరిణామాలతో ఆ పార్టీ బలంగా పుంజుకుంటూ వస్తుంది.ఆ ప్రభావం దుబ్బాక లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

 Congress Leader Vijayashanthi Joining  In Bjp Soon,congress Leaders, Bjp, Dubbak-TeluguStop.com

Telugu Bandi Sanjay, Congress, Dubbaka, Raghunandan Rao, Telangana, Vijay Shanth

దుబ్బాక సీట్లు బీజేపీ గెలుచుకున్న దగ్గర నుంచి ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.ముఖ్యంగా బీజేపీ లో చేరాలా వద్దా ? అనే సందిగ్ధంలో ఉన్న వారంతా ఇప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా, బీజేపీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్నారు .ఈ మేరకు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తో పాటు, మరికొంతమంది కీలక నాయకులు బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్లి బీజేపీ తీర్థం తీసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది.విజయశాంతి తో పాటు , కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం మొదలవడంతో కాంగ్రెస్ లో ఆందోళన నెలకొంది.

Telugu Bandi Sanjay, Congress, Dubbaka, Raghunandan Rao, Telangana, Vijay Shanth

కాంగ్రెస్ లోని చాలామంది కీలక నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.ఉప ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని ఒక అంచనాకు వచ్చేయడం, అలాగే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఎదురుగాలి వీస్తూ ఉండడం,  ఇంకా ఈ పార్టీలోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతో పార్టీ మారాలని ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.వీరితో పాటు బీజేపీకి చెందిన కొంతమంది అసంతృప్తి నాయకులు సైతం బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ  అగ్ర నాయకులతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎవరి సంగతి ఎలా ఉన్నా, విజయశాంతి కి మాత్రం బీజేపీ లో మంచి ప్రాధాన్యత అయితే దక్కుతుందని , ఆమెకు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకులు సిద్ధంగా ఉన్నారని ,తెలంగాణలో కేసీఆర్ పై ఘాటుగా విమర్శలు చేస్తూ, బీజేపీ కి విజయశాంతి మంచి ఊపు తీసుకు రాగలరని బీజేపీ అధిష్టానం నమ్ముతోంది.

అందుకే ఆమె హోదాకు తగిన పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న  నేపథ్యంలో ఈనెల 14వ తేదీన ఏం జరగబోతోంది అనే టెన్షన్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube