విజయశాంతి కోపమంతా ఉత్తమ్ మీదనే ?

తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ఉన్నా, ఇప్పుడు ఆమె పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.హోరా హోరీగా సాగుతున్న దుబ్బాక ఎన్నికల ప్రచారానికి ఆమె దూరంగా ఉంటున్నారు.

 Congress Leader Vijayasanthi Not Active In Party   Uttam Kumar Reddy, Telangana,-TeluguStop.com

దీంతో ఆమె బిజెపిలో చేరబోతున్నారని, ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో మంతనాలు జరిపారని, అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆమె చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇలా ఎన్నో ప్రచారాలు కొద్ది రోజులుగా జరుగుతూనే వస్తున్నాయి.టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నేరుగా విమర్శలు చేసే విషయంలో విజయశాంతి ఎక్కడా వెనక్కి తగ్గరు .ఆ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉంటారు.కానీ కీలకమైన ఎన్నికల సమయంలో ఆమె దూరంగా ఉండడం కాంగ్రెస్ కు ఇబ్బంది పెట్టే అంశమే.

ఇదిలా ఉంటే విజయశాంతి బీజేపీ లోకి చేరడం లేదని, తాను ఇప్పటికే ఆమె తో మాట్లాడాను అంటూ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ప్రకటించారు.ఇదిలా ఉంటే విజయశాంతి అలక చెందడానికి అసలు కారణం వేరే ఉందట.

ఆమె పార్టీ మారాలనుకోవడం కూడా పిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్న కోపం కారణంగానే అనే ప్రచారం జరుగుతోంది.ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తే నే తాను మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతానని, విజయశాంతి చెబుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.తాను కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నా, టి పీసీసీ సమావేశానికి తనను ఎందుకు పిలవలేదని రాములమ్మ ప్రశ్నిస్తున్నారు.

ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొన్నా, తనతో పాటు టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ఎందుకు పాల్గొన లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు.ఇప్పుడే కాక తాను మెదక్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తనవెంట నడవలేదు అనే విషయాన్ని ఇప్పుడు రాములమ్మ హైలెట్ చేస్తున్నారట.

అయితే విజయశాంతి డిమాండ్ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఇప్పటికిప్పుడు అధిష్టానం తప్పిస్తుందా అంటే అది అనుమానమే .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube