కాంగ్రెస్ నేత ఇంట్లో కరోనా కలకలం.. ఏకంగా 12మందికి !

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

 Congress Leader Sharad Pawar Tested Negative-TeluguStop.com

ప్రతి ఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది.రాజకీయ నాయకుల్లో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

కేసుల సంఖ్య పెరిగినా కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంది.ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుండటంతో కరోనా బాధితులు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతూ క్యూర్ అవుతున్నారు.

 Congress Leader Sharad Pawar Tested Negative-కాంగ్రెస్ నేత ఇంట్లో కరోనా కలకలం.. ఏకంగా 12మందికి -Telugu Political News-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఇంట్లో కరోనా విజృంభించింది.మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఆయన నివాసంలో పని చేస్తున్న సహాయకులకు 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని సోమవారం మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు.

ఈ మేరకు శరద్ పవార్ కు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించామని, రిపోర్టుల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించారు.ఇంట్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో శరద్ పవార్ నాలుగు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటారని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని తెలిపారు.ఈ మేరకు శరద్ పవార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చింది.

పాజిటివ్ వచ్చిన 12 మంది బాధితులను ముంబాయిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నాడు.

#Congress #Corona #Maharastra #Congress #CongressSharad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు