రేషన్ డోర్ డెలివరీ పథకంపై కాంగ్రెస్ నేత సెటైర్లు..!!

ఇటీవల జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి మాసం నుండి రేషన్ డోర్ డెలివరీ వాహనాల ద్వారా బియ్యం మరియు సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ పథకంపై విమర్శల వర్షం కురిపించారు.

 Congress Leader Satires On Ration Door Delivery Scheme-TeluguStop.com

డోర్ డెలివరీ అని చెప్పి ప్రజల చేత రోడ్లపై పడిగాపులు కాయిస్తున్నారు అని మండిపడ్డారు.ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకం ఒక తుగ్లక్ పథకంలా తయారయింది అని సెటైర్లు వేశారు.

ఈ విధానం ద్వారా రేషన్ డీలర్ లలో అభద్రతాభావం నెలకొంది అని పేర్కొన్నారు.ఈ రేషన్ వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వ్యాఖ్యానించారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించి గతంలో మాదిరిగా రేషన్ షాపుల వద్ద బియ్యం తెచ్చుకునే విధంగా పరిస్థితుల కల్పించాలని కోరారు.రేషన్ డోర్ డెలివరీ పథకం ద్వారా ప్రభుత్వంపై 830 కోట్ల రూపాయిలు భారం తప్పా ఉపయోగం ఏమీ లేదని పేర్కొన్నారు.

 Congress Leader Satires On Ration Door Delivery Scheme-రేషన్ డోర్ డెలివరీ పథకంపై కాంగ్రెస్ నేత సెటైర్లు..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com
#Tulasi Reddy #YS Jagan #Andhra Pradesh #Congress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు