రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత సంపత్‌ సీరియస్‌

ఎంపీ రేవంత్‌ రెడ్డి గత కొన్ని రోజులుగా యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొంటున్నాడు.ఆందోళన చేస్తున్న వారికి తనవంతు మద్దతు అందిస్తున్నాడు.

 Congress Leader Sampath About Revanth Reddy Telugu Updated News-TeluguStop.com

గతంలో మైనింగ్‌ విషయంలో కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది.ఇప్పుడు మాత్రం కాంగ్రెస్‌ ఎంపీ అయిన రేవంత్‌ రెడ్డి యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు.

తాజాగా ఒక సందర్బంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కు యురేనియం మైనింగ్‌ గురించి కనీసం అవగాహణ లేదు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఆ వ్యాఖ్యలపై సంపత్‌ సీరియస్‌ అయ్యాడు.

రేవంత్‌ రెండు మూడు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై సంపత్‌ తాజాగా స్పందించాడు.నేను ఢిల్లీలో ఉన్న కారణంగా ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందన్నాడు.నాకు యురేనియం మైనింగ్‌ గురించి తెలియదని రేవంత్‌ రెడ్డి గారు అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.నేను పీహెచ్‌డీ చేశాను.

నాకు రేవంత్‌ రెడ్డి ముద్దుల అన్నయ్య.ఆయన అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు.

ఆయనలా నాకు సెల్ఫీలు తీసుకోవడం అయితే రాదు కాని, సామాజిక అంశాలపై అవగాహణ ఉందని రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చాడు.కాంగ్రెస్‌ పార్టీ నేతల మద్య మొదలైన ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో అనే టెన్షన్‌ ఆ పార్టీలో కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube