పిక్‌టాక్‌ : నిన్నటి వరకు ఢీ అంటే ఢీ అని ఇప్పుడు కరచాలనం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మరియు శాశ్వత మిత్రులు ఉండరనే విషయం తెల్సిందే.స్వపక్షంలో విపక్షంగా ఉండే వారు రాజకీయాల్లో చాలా కామన్‌గా కనిపిస్తూనే ఉంటారు.

 Congress Leader Sachin Pilot Meets Cm Ashok Gehlot,congress Leader Sachin Pilot,-TeluguStop.com

అప్పటి వరకు ఢీ అంటే ఢీ అంటూ విమర్శలు చేసుకున్న వారు ప్రభుత్వంను పడగొట్టేందుకు ప్రయత్నించే వారు కూడా ఆ తర్వాత మిత్రులు అవుతారు.ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎన్నో సంక్షోభాలను చూశాం.

అయితే తాజాగా కనిపించిన రాజకీయ సంక్షోభం విభిన్నమైనదిగా చెప్పుకోవచ్చు.రాజస్థాన్‌ అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎదుర్కొన్న ఈ రాజకీయ సంక్షోభంకు ఫుల్‌ స్టాప్‌ పడినది.

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ తనను అవమానించాడంటూ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండా ఎగురవేశాడు.దాంతో అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డట్లయ్యింది.

బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ మరియు ప్రియాంక గాంధీలు పైలెట్‌ వర్గాన్ని బుజ్జగించి చివరకు మళ్లీ పార్టీలోకి తీసుకు వచ్చారు.

తనపై అశోక్‌ గహ్లోత్‌ తీవ్ర విమర్శలు చేశాడంటూ చెప్పిన సచిన్‌ పైలెట్‌ నేడు సీఎం అధికారిక నివాసానికి స్వయంగా వెళ్లి మరీ ఆయనతో మాట్లాడటం జరిగింది.త్వరలో జరుగబోతున్న అసెంబ్లీ సమావేశాల గురించి వీరు చర్చించినట్లుగా తెలుస్తోంది.

దీంతో రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభంకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లేనా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube