రేవంత్ చుట్టూ ' కాంగ్రెస్ ' రాజకీయం ? 

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు సొంత పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది.పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై ఎక్కడా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ ఆలోచించడం లేదు.కేవలం తమకు పార్టీలోనూ, పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వాలి అని, వేరొకరికి ఆ ప్రాధాన్యం ఇస్తే తాము చూస్తూ ఊరుకోబోము అన్నట్లు గా వ్యవహరిస్తూ, పార్టీలోని వేరే నాయకులను దెబ్బతీసే క్రమంలో సొంత పార్టీకి ఇబ్బందులు తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్లంతా గుర్రు గా ఉండడం,  ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం ప్రాధాన్యం ఇస్తే,  తాము పార్టీ నుంచి బయటికి వెళ్లిపోతాము అన్నట్లుగా బెదిరింపులకు దిగడం వంటి వ్యవహారాలు ఎప్పటి నుంచో చోటుచేసుకుంటూనే వస్తున్నాయి.

 Revanth Reddy Troubled With Senior Congress Leaders Behavior ,  Revanth Reddy, T-TeluguStop.com

అయితే తాజాగా రైతు భరోసా యాత్ర చేపట్టిన రేవంత్ కు మంచి స్పందన వచ్చింది.ఈ వ్యవహారాలు పార్టీలోని సీనియర్ నాయకులకు అస్సలు నచ్చడమే లేదట.

ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి హనుమంత రావు , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు ఎక్కువగా రేవంత్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడట.అదీ కాకుండా తాజాగా రేవంత్ వ్యవహారంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

రేవంత్ ప్రాధాన్యత పెరగకుండా చూసే పనిలో ఉన్నారట.కాంగ్రెస్ సీనియర్లు చాలామంది ఏకతాటిపైకి వచ్చి మరీ రేవంత్ కు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ , కాంగ్రెస్ ప్రాధాన్యం పెరగకుండా చూస్తున్నారట.

అలాగే రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన కొండా విశ్వేశ్వరరెడ్డి ద్వారా కొత్త పార్టీ పెట్టిస్తున్నారు అనే విషయాన్ని సైతం అధిష్టానం పెద్దలకు ఫిర్యాదుల రూపంలో పంపిస్తున్నారట.కానీ రేవంత్ మాత్రం ఇవేమీ తాను లెక్క చేేయను అన్నట్లుగా తన రాజకీయ వ్యూహాలకు మరింత పదును పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube