రేవంత్ కొత్త పార్టీకి ముహూర్తం... తెలంగాణ పాలిటిక్స్‌లో షాక్‌లే షాక్‌లు !

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి ఇక అధికారంలోకి వ‌చ్చే ఛాన్సులు క‌న‌ప‌డ‌డంలేదు.ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో నిర్వీర్యం అయిపోయింద‌నే చెప్పాలి.2018 అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఆ పార్టీ ఘోరంగా ప‌త‌న‌మ‌వుతూ వ‌స్తోంది.దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్ గ‌ల్లంతు, తాజాగా జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సైతం కాంగ్రెస్ ఘోర‌మైన ఓట‌మి మూట‌క‌ట్టుకోవ‌డంతో ఇక ఆ పార్టీకి తెలంగాణ రాజ‌కీయాల్లో స్పేస్ లేద‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది.

 Congress Leader Revanth Reddy To Start New Political Party, Ghmc Elections, Bjp,-TeluguStop.com

అదే స‌మ‌యంలో ఇక్క‌డ కాంగ్రెస్ ప్లేస్‌లోకి బీజేపీ వ‌చ్చేస్తోంద‌న్న‌ది కూడా క్లారిటీ వ‌స్తోంది.

కాంగ్రెస్ నేత‌లు కూడా త‌మ భ‌విష్య‌త్తు వెతుక్కునే ప‌నిలో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే రెడ్డి సామాజిక వ‌ర్గం తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌ట్టు కోల్పోతున్న ప‌రిస్థితి కూడా చూస్తున్నాం.అందుకే రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రెడ్డి సామాజిక వ‌ర్గం తెలంగాణ‌లో అన్ని విధాలా వెన‌క‌ప‌డిపోయింది.వ్యాపార‌, ఆర్థిక ప‌రంగా వెన‌క‌ప‌డిపోయింది.

ఈ క్ర‌మంలోనే ఈ సామాజిక వ‌ర్గ నేత‌ల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక్క‌రే ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్నారు.

Telugu Congress, Congressrevanth, Ghmc, Revanth Reddy, Telangana-Telugu Politica

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్పుకోవ‌డంతో తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు రేవంత్ రెడ్డికి ఇచ్చినా కూడా తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ను ప‌ట్టించుకునే, న‌మ్మే ప‌రిస్థితుల్లో అయితే లేరు.ఇక కాంగ్రెస్ నాయ‌కులు, ఇత‌ర కొత్త త‌రం, యువ‌త‌రం నేత‌లు అంతా బీజేపీ వైపు మ‌ళ్ల‌క‌ముందే ప్రాంతీయ పార్టీ పెడితే ఇక్క‌డ ప‌ట్టు సాధించ‌వ‌చ్చ‌న్న‌దే రేవంత్ ప్లాన్‌.దీనికి సంబంధించి ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది.

ఇక బీజేపీ తెలంగాణ‌కు చేసిందేమి లేక‌పోవ‌డం కూడా ఆ పార్టీకి ఇక్క‌డ రాష్ట్రం అంత‌టా స్కోప్ ఉంటుందా ? అన్న సందేహాలు ఉన్నాయి.తెలంగాణ‌లో చాలా చోట్ల ఆ పార్టీకి నాయ‌కులు, కేడ‌ర్ లేదు.

ఇక రేవంత్‌కు తిరుగులేని క్రేజ్ ఉండ‌డంతో ఇక్క‌డ రాజ‌కీయ శూన్య‌త‌ను భ‌ర్తీ చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.మ‌రి రేవంత్ పార్టీ పెడితే తెలంగాణ‌లో ఊహించ‌ని షాకులు త‌ప్ప‌వు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube