మల్కాజ్ గిరి ఎంపీ గా బరిలో దిగుతున్న రేవంత్ రెడ్డి!  

మల్కాజిగిరి ఎంపీ గా పోటీ చేసే ప్రయత్నంలో ఉన్న రేవంత్ రెడ్డి..

  • తెలంగాణలో లో అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తన వైపు లాక్కుని ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే ఒక అరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయంపై దృష్టి పెట్టకుండా పార్లమెంట్ ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉంది.

  • అయితే ఈసారి కాంగ్రెస్ పార్లమెంట్ బరిలో రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నీ లో కీలక నేత రేవంత్ రెడ్డి కూడా మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసిన తర్వాత దీనిపై రేవంత్ పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు వినిపిస్తుంది. ఎలాగైనా టిఆర్ఎస్ పార్టీ గెలుపు అవకాశాలు తగ్గించాలని లక్ష్యంతో ఉన్న రేవంత్ రెడ్డి ఇ పార్లమెంట్ ఎన్నికలను ఒక అవకాశంగా వాడుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది.