కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ చీపురు పట్టుకుంది.నిన్న లిక్కిం పూర్ వెళ్తుండగా.
యూపీ పోలీసులు అదుపులోకి తీసుకోవటం జరిగింది.గెస్ట్ హౌస్ కి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో గెస్ట్ హౌస్ మొత్తం చెత్తాచెదారం ఉండటంతో.ప్రియాంక గాంధీ చీపురు పట్టుకొని ఊడ్చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ
దేశంలో అతిపెద్ద అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రం కావడంతో యూపీ ఎన్నికలనీ దేశంలో మిగతా రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అరెస్టు చేయటంతో ఈ వార్త జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.
పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా దూసుకుపోతుంది.ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో గట్టిగా విమర్శలు చేస్తూ రాణిస్తోంది.
ఈ క్రమంలో బిజెపి ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేయటం యూపీ రాజకీయాల్లో కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది.