ఇదెక్కడి న్యాయం: కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కు ఒక న్యాయం, కాంగ్రెస్ కు మరో న్యాయమా అంటూ సీఎం కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు.

 Congress Leader Komatireddy Venkatareddy Coments On Cm Kcr-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆవిర్భావ దినోత్సవ సత్యాగ్రహానికి అనుమతి నిరాకరించడం పై కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు.దేశంలో కాంగ్రెస్ పార్టీకి అంతం అనేది లేదని, కెసిఆర్ నియంతృత్వ పోకడలకు త్వరలోనే అడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు.

కెసిఆర్ పరిపాలనలో సత్యాగ్రహం చేస్తామని చెప్పిన వారికి అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

గతంలో కాంగ్రెస్ పార్టీనే టిఆర్ఎస్ భవన్ ఇచ్చిందనే విషయాన్ని కేసీఆర్ మరిచిపోతున్నారని, మాయమాటలతో ఐదేళ్ల పరిపాలన చేశారని కోమటిరెడ్డి విమర్శించారు.

కెసిఆర్ చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని ములుగు జిల్లా ఎమ్మెల్యే సీతక్క విమర్శలు చేశారు.కాంగ్రెస్ పార్టీ దేశం , రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని , బిజెపి,టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక తానులో ముక్కలే అని ఆమె ఆరోపించారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube