పక్క రాష్ట్రం చేయగా మీకు సమస్య ఏంటీ?  

Congress Leader Jeevan Reddy Comments Telangan Governament-congress,jeevan Reddy,rtc Strike,rtc Telangana,telangana Cm Kcr

తెలంగాణ ఆర్టీసీ కార్మీకులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు.వెంటనే కార్మికులు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించడంతో పాటు వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందిగా కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే తెరాస ప్రభుత్వం మసైపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు మసికాక తప్పదని ఆయన హెచ్చరించాడు.

Congress Leader Jeevan Reddy Comments Telangan Governament-congress,jeevan Reddy,rtc Strike,rtc Telangana,telangana Cm Kcr-Congress Leader Jeevan Reddy Comments Telangan Governament-Congress Jeevan Rtc Strike Telangana Cm Kcr

ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులు చాలా కష్టపడ్డారు.ఆ సమయంలో వారికి కేసీఆర్‌ హామీలు ఇచ్చారు.ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చకుండా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.పక్క రాష్ట్రం ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వంలో విలీనం చేసుకుంది.ఏపీ ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు మాత్రం బాధలు పడుతున్నట్లుగా షబీర్‌ అలీ పేర్కొన్నాడు.

ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నట్లుగా ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే వచ్చే నష్టం ఏంటీ అంటూ ఆయన ప్రశ్నించాడు.వెంటనే ఆర్టీసీ సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా వారి పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.