ఓటు వేయలేక పోయినందుకు డిగ్గీ రాజా పశ్చాతాపం  

Congress Leader Digvijay Singh Not Cost His Vote-

దేశ వ్యాప్తంగా ఓటింగ్‌ శాతంను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల కమీషన్‌ కోట్లు ఖర్చు పెట్టి స్టార్స్‌తో ప్రచారం చేయించారు. అయినా కూడా ఓటింగ్‌ పర్సంటేజ్‌ అంతంత మాత్రంగానే ఉంది..

ఓటు వేయలేక పోయినందుకు డిగ్గీ రాజా పశ్చాతాపం-Congress Leader Digvijay Singh Not Cost His Vote

సామాన్యుల మాట ఏమో కాని, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకోకుంటే వారి ప్రత్యర్థులు ఆటాడేసుకోవడం ఖాయం. ప్రస్తుతం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ను బీజేపీ నాయకులు ఒక ఆట ఆడేసుకుంటున్నారు.మహారాష్ట్ర బోపాల్‌ నుండి ఎన్నికల బరిలో ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకోలేక పోయాడు.

బోపాల్‌ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో పోలింగ్‌ సరలిని పరిశీలించిన ఆయన తన ఓటును వేసేందుకు మాత్రం వెళ్లలేదు. 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊర్లో ఓటు హక్కు ఉన్న కారణంగా దాన్ని వినియోగించుకోలేక పోయాడు.దిగ్విజయ్‌ ఓటు హక్కును వినియోగించుకోకపోవడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాసామ్యం అంటే నమ్మకం లేకుండా ప్రవర్తించాడు అంటూ శివరాజ్‌ సింగ్‌ విమర్శలు చేశాడు.

తనపై వస్తున్న విమర్శలకు దిగ్విజయ్‌ సింగ్‌ స్పందిస్తూ. ఈసారి ఓటు హక్కును వినియోగించుకోలేక పోయాను.

అంతదూరం వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల నేను ఓటు హక్కు వినియోగించుకోలేక పోయాను. వచ్చేసారి తప్పకుండా నా హక్కును వినియోగించుకుంటానంటూ చెప్పుకొచ్చాడు.