మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.మేము టిఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక తల్లికి పుట్టిన నేను టిడిపిని వీడనన్నాడు.

 Congress Konda Surekha Sensational Comments On Minister Errabelli Dayakar Rao-TeluguStop.com

మరీ ఎంత మందికి పుట్టాడో ఆయనకే తెలియాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొండా సురేఖ.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలో కొండా బయోపిక్ మూవీ షూటింగ్ ను రామ్ గోపాల్ వర్మ, కొండా దంపతులు ప్రారంభించారు.

నేను చదువుకునే రోజుల్లో నా కోసం ఉదయం ఏడు గంటలకు కొండా మురళి చక్కర్లు కొట్టే వాడని కొండా సురేఖ అన్నారు.మమ్మల్ని ఎంతగానో అనిచి వేసేందుకు రాజకీయంగా అణగదొక్కేందుకు ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేశారు.

 Congress Konda Surekha Sensational Comments On Minister Errabelli Dayakar Rao-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో మంత్రి దయాకర్ రావు ఒక్కరు కానీ తనకంటే ముందే మేము రాజకీయాల్లో ఎదిగి మాకే మంత్రి పదవి వరించిందన్నారు.

Telugu Congress Konda Surekha, Konda Movie, Minister Errabelli Dayakar Rao, Ram Gopal Varma, Sensational Comments-Political

అప్పట్లో మమ్మల్ని చంద్రబాబు నాయుడు టిడిపిలోకి ఆహ్వానిస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నన్ని రోజులు పార్టీలోకి మేము రామ్ అని తేల్చి చెప్పాం అన్నారు.కొండా మూవీలో రాజకీయంతో పాటు మా ప్రేమ చరిత్ర కూడా ఉంటుందని ఈ రెండు అంశాలతో తీస్తున్న ఆర్జీవీ సినిమా యావత్ లోకానికి ఆదర్శంగా నిలుస్తుందని కొండా సురేఖ అన్నారు.

#CongressKonda #Ram Gopal Varma #Konda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు