నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ( Tukkuguda )లో కాంగ్రెస్ ఇవాళ ‘జనజాతర’ సభను నిర్వహించనుంది.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా సభా వేదికపై నుంచి సమర శంఖం పూరించనుంది.

ఈ జనజాతర సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) హాజరుకానున్నారు.ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల( Lok Sabha elections ) మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు.

పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ హామీలు ఇచ్చింది.కాగా ఈ సభకు ఇప్పటికే తెలంగాణ పీసీసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలో విజయభేరీ పేరుతో సభను నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ ఆ ప్రాంతాన్ని సెంటిమెంట్ గా భావిస్తోంది.

ఈ క్రమంలోనే తుక్కుగూడ వేదికగా జనజాతర సభను ఏర్పాటు చేసింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు