రిపేర్ మోడ్ లో తెలంగాణ కాంగ్రెస్ !

చలి చీమలు ఒక్కటిగా ఉంటే బలవంతమైన సర్పాన్ని కూడా మట్టికరిపైస్తాయన్న సామెత కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధిష్టానానికి ఇప్పుడు అర్థం అయినట్లుగా ఉంది.ప్రజల్లో చెప్పుకోదగ్గ గుర్తింపు ఉన్నప్పటికీ వర్గ పోరాటాలు సీనియర్లు జూనియర్లు మధ్య గొడవలతో సతమతమైపోతూ తన ప్రాభవాన్ని కోల్పోతున్న పార్టీ ఐక్యత రాగం పాటించిన కర్ణాటకలో( Karnataka ) అధికారంలోకి రావడంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కి రిపేర్ చేసే పని లో పడిందట కాంగ్రెస్ అధిష్టానం.

 Congress Hi Command Trying To Repair T Congress ,  T Congress ,  Karnataka, Reva-TeluguStop.com

సీనియర్ల బృందం రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్న అవగాహన కు వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం వారిని రిపేర్ చేసే బాధ్యత ను తమ ప్రదాన వ్యూహ కర్త సునీల్ కనుగోలు కు అప్పచెప్పినట్లుగా తెలుస్తుంది.కర్ణాటక కాంగ్రెస్ను ఒక తాటిపై నడిపించిన ఆయన ఇకపై తెలంగాణలో సీనియర్లు జూనియర్లకు మధ్యన సంది కుదిర్చే బాధ్యతను కూడా తీసుకున్నారట.

Telugu Congresscommand, Congress, Karnataka, Revanth Reddy-Telugu Political News

మొత్తం సీట్లను రెండు భాగాలుగా విభజించి ఒక భాగం మీద రేవంత్ రెడ్డికి బాద్యత ఇచ్చి మరో భాగం మీద సీనియర్లకు అధికారం ఉండేలా చూడాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినప్పటికీ టికెట్ల కేటాయింపులో మాత్రం కచ్చితంగా సర్వేలో ఎవరికైతే ప్రజాదరణ ఉంటుందని తెలుస్తుందో వారికి మాత్రమే టికెట్లు కేటాయించాలని, ఈ రూల్ మాత్రంఇరు వర్గాలు గుర్తు పెట్టుకోవాలని సున్నితమైన హెచ్చరిక కూడా కాంగ్రెస్ అధిష్టానం చేసిందట.ఆఖరి నిమిషం వరకు ఇంట్లో కూర్చొని ఎవరో ఒకరిని పట్టుకుని టికెట్ పొందాలని భావించే వారి పప్పులు ఇక ఉడకవని తెలుస్తుంది .

Telugu Congresscommand, Congress, Karnataka, Revanth Reddy-Telugu Political News

తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య అంతర్గత పోరే అని దానిని సరి చేసుకుంటే గెలుపు ఏమంత కష్టం కాదని అంచనాలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది.నేతలు తమ మధ్య విభేదాలు పక్కన పెట్టి గ్రౌండ్ లెవెల్ లో కష్టపడాల్సి ఉంటుందన్న హెచ్చరికను మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది .మరి వారి వ్యూహాలు ఫలిస్తే మాత్రం కాంగ్రెస్కు మంచి రోజులు వచ్చినట్లుగా భావించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube