కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారింది..: హరీశ్ రావు

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్( BRS ) నిర్వహిస్తున్న రైతు దీక్షలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిందని హరీశ్ రావు( Harish Rao ) అన్నారు.

 Congress Has Become An Anti-farmer Government ,harish Rao , Brs ,farmers, Cong-TeluguStop.com

రైతులు చనిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు.కేసీఆర్ ను తిట్టడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా రైతులకు బీజేపీ ఏ మేలు చేయలేదన్నారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చిందని చెప్పారు.బీఆర్ఎస్ రైతు దీక్ష చేస్తుంటే.బీజేపీ నేతలు సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube