కోస్తాంధ్ర‌కు కాంగ్రెస్ ప‌గ్గాలు..‌  ప‌ల్లంరాజు చ‌క్రం..!

ఏపీ కాంగ్రెస్ చీఫ్ ప‌గ్గాలు మారుతున్నాయా?  కేంద్రంలో ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి ప‌ల్లం రాజు చ‌క్రం తిప్పుతున్నారా?  పుంజుకోని కాంగ్రెస్ ప‌రుగులు పెట్టాలంటే.మిష‌న్ కోస్తాంధ్ర చేప‌ట్టాల‌ని ఆయ‌న కాంగ్రెస్‌ను కోరుతున్నారా? అంటే.ఔన‌నే అంటున్నారు పార్టీలోని కొంద‌రు నాయ‌కులు.ఏపీకాంగ్రెస్ ప‌గ్గాలు.ఇప్ప‌టి వ‌ర‌కు రాయ‌ల‌ సీమ నేత‌ల‌కే ద‌క్కుతున్నాయి.గ‌తంలో వైఎస్‌, త‌ర్వాత ర‌ఘువీరా రెడ్డి, ఇప్పుడు సాకే శైల‌జానాథ్ వంటివారు చ‌క్రం తిప్పుతున్నారు.

 Congress Got Leadership With Coastal Andhra, Congress, Raghuveera, Pallam Raju,-TeluguStop.com

రాష్ట్ర విభ‌జ‌నకు ముందు ఉత్త‌రాంధ్ర‌కు ముందు ప్ర‌స్తుత వైసీపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కాంగ్రెస్ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించారు.

అంత‌కుమించి మిగిలిన ప్రాంతాల్లో కోస్తాంధ్ర‌కు ఇప్ప‌టి వ‌ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు.

మ‌రీ ముఖ్యంగా మూడు ద‌శాబ్దాలు గా ఇదే ప‌రిస్థితి కాంగ్రెస్‌లో ఉంది.ఈ నేప‌థ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఏపీ కాంగ్రెస్ అత్యున్న‌త స్థాయి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

అయితే, ఇటీవ‌లే క‌దా అనంత‌పురం జిల్లాకు చెందిన సాకే శైల‌జానాథ్‌కు ఇచ్చామ‌ని.ఇప్పుడు ప్ర‌క్షాళ‌న ఎలా సాధ్య‌మ‌నేది కొంద‌రు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌.

కానీ, ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ కాంగ్రెస్ స‌హా బీహార్ కాంగ్రెస్‌లోనూ అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకున్నాయ‌ని.కేవ‌లం ఏడాదిలోనే చీఫ్‌ల‌ను ప‌క్కన పెట్టార‌ని తెలిపారు.

Telugu Ap Congress, Congress, Pallam Raju, Raghuveera, Sailaja Nadh-Telugu Polit

పార్టీ ప‌రుగులు తీయాలంటే.నిర్ణ‌యాలు ఎప్పుడైనా తీసుకోవ‌చ్చ‌ని ప‌ల్లం రాజు సూచించారు.గ‌తంలో మాదిరిగా కేవ‌లం ఐదేళ్ల త‌ర్వాతే పార్టీ చీఫ్‌ను మార్చే ప‌రిస్థితి ఇప్పుడు లేద‌ని.స్థానికంగా ఉన్న ప‌రిస్థితి.పార్టీని న‌డిపించే నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న అన్న‌ట్టు విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.ఇక‌, గ‌డిచిన ఆరేడు సంవ‌త్స‌రాలుగా ఏపీ కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే.

సీమ నేత‌ల‌కే(ర‌ఘువీరా, శైల‌జానాథ్‌) వ‌రుస‌గా కాంగ్రెస్ ప‌గ్గాలు ద‌క్కుతున్నాయి.అయితే, వారి ఆధ్వ‌ర్యంలో జాతీయ‌ పార్టీ కాస్తా.

ప్రాంతీయ పార్టీ అయింద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నారు.

పైగా.

వ‌రుస ఓట‌ములు.మ‌రింత‌గా కాంగ్రెస్‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తున్నాయి.

సంస్థాగ‌త ఓటు బ్యాంకు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది.ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వ్య‌తిరేక‌త నుంచి మ‌ళ్లించ‌లేక పోవ‌డంతో.

ఇప్పుడు ఎక్క‌డా కాంగ్రెస్ జెండా కూడా క‌నిపించ‌డం లేదు.ఈ నేప‌థ్యంలో ప‌ల్లం రాజు వాద‌న బాగానే ఉంద‌ని కొంద‌రు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

అయితే, ఏదైనా అధిష్టానమే నిర్ణ‌యించాల‌నే సంస్కృతి పోగుప‌డ్డ కాంగ్రెస్‌లో ఇప్ప‌ట్లో ఈ విష‌యం తేలుతుందా? అనేది పెద్ద ప్ర‌శ్నే.మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube