కేంద్ర మాజీ మంత్రి పెళ్లి,60 ఏళ్ల వయసులో

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే ఆయన 60 ఏళ్ల వయసు లో తన చిరకాల స్నేహితురాలు అయిన 60 ఏళ్ల రవీణా ఖురానా ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.

 Congress General Secretary Mukul Wasnik Marreis At 60 Years-TeluguStop.com

అయితే వీరిద్దరి పెళ్లి చాలా నిరాడంబరంగా ఢిల్లీ లోని ఒక హోటల్ లో జరిగింది.వీరి పెళ్లి కోసం అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్,కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తో మరి కొందరు పెద్దలు హాజరుఅయినట్లు తెలుస్తుంది.60 ఏళ్ల వయసులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.వీరి పెళ్ళికి అత్యంత సన్నిహితంగా ఉండే చాలా కొద్ది మాత్రమే హాజరయ్యారు.ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్ పార్టీలో పలు కీలక పదవుల్లో ఉండడమే కాకుండా కేంద్రమంత్రిగానూ ఆయన సేవలందించారు.

ప్రస్తుతం AICC ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ముకుల్ వాస్నిక్.అయితే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అవివాహితుడిగా ఉన్న ముకుల్ ఈ 60 ఏళ్ల వయసులో తన చిరకాల స్నేహితురాలు రవీణా ను పెళ్లి చేసుకున్నారు.

ఈయన భార్య రవీణా ఖురానా స్వస్థలం ఢిల్లీ ఆమె వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉంటూనే పలు వ్యాపారాలు చేస్తున్నారు.ముకుల్, రవీణా పెళ్లి నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.

గతేడాది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తో అప్పట్లో అధ్యక్ష పదవి రేసులో వాస్నిక్ పేరు కూడా వినిపించింది.వాస్నిక్ మహారాష్ట్ర రాజకీయ నేత బాల కృష్ణ కుమారుడు.

తండ్రి కూడా రాజకీయాల్లో ఉండడం తో వాస్నిక్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube