వరి ధాన్యం కొనుగోళ్ళపై కాంగ్రెస్ పోరు బాట...

తెలంగాణలో పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ ప్రకంపనలు రేగుతున్న పరిస్థితి ఉంది.అయితే  ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేయాలని పట్టుబడుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ విధానాలకు నిరసనగా పోరుబాట నిర్వహిస్తున్నామని  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

 Congress Fights Over Paddy Procurement ...telangana Politics, Telangana Congress-TeluguStop.com

అన్నట్టుగానే నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఇటు కేంద్ర ప్రభుత్వం.

ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులను మోసం చేస్తున్నాయని, రాజకీయాల కోసం రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ మండి పడింది.అంతేకాక రైతులకు అన్యాయం జరుగుతున్నదని బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదని, బీజేపీ స్పష్టత ఇవ్వడం లేదని టీఆర్ఎస్ వ్యాఖ్యానిస్తున్నదని వీరిద్దరూ కలసి రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండి పడ్డారు.

Telugu @revanth_anumula, Telangana-Political

అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు అంశం హాట్ టాపిక్ గా మారింది.కాంగ్రెస్ పోరాటంలో దిగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులలో కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారే  అవకాశం ఉంది.ప్రస్తుతం అందరి పోరాటం బీజేపీపైనే కావడంతో ఇప్పుడు బీజేపీ పార్టీ ఎటూ మాట్లాడలేని పరిస్థితికి చేరుకుంది.

అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న పరిస్థితుల్లో మరి కేంద్రం స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తుందా లేక స్పందించకుండా ఊరుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.అయితే బీజేపీ మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా తన పోరాటం ఉధృతం చేస్తుందా లేక నిరసనల వరకే పోరాటాన్ని కేంద్రీకృతం చేస్తుందా అన్నది భవిష్యత్తులో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube