గ్రేటర్ దెబ్బ రేవంత్ కు కలిసి వస్తోందిగా ? 

గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ప్రభావం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేసింది.అసలు ఇప్పుడు కాదు, గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పు డే కాంగ్రెస్ ప్రభావం ఏమిటో అందరికీ స్పష్టంగా అర్థం అయిపోయింది.

 Congress Dominates The Idea Of ​​giving Rewanth Reddy The Pcc Presidency, Ba-TeluguStop.com

పూర్తిగా కాంగ్రెస్ ను పక్కన పెట్టి , బిజెపి టీఆర్ఎస్ మధ్యే పోటి అంతా ఉంటుందని , కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదు అనే విషయం పై స్పష్టత వచ్చేసింది.ఇక బిజెపి టిఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు గా పోటీ పడుతూ, ఎన్నికల ప్రచారం నిర్వహించాయి.

కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఒక్కరే ఆ పార్టీ తరుపున గట్టిగా కష్ట పడుతున్న ట్టుగా వ్యవహరించారు.టిఆర్ఎస్ బిజెపి లపై విమర్శలు చేస్తూ , కాంగ్రెస్ కు గ్రేటర్ లో పట్టు పెరిగే విధంగా చేసేందుకు ప్రయత్నించారు.

అయితే ప్రస్తుతం గ్రేటర్ ఫలితాలు కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నట్టు స్పష్టత వచ్చేసింది.అయితే కాంగ్రెస్ పార్టీ ఓడినా, రేవంత్ మాత్రం ఇప్పుడు హీరోగానే మారబోతున్నారు.

కాంగ్రెస్ ప్రభావం అసలు ఏమాత్రం లేదని జనాలు ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా, రేవంత్ మత్రం ఆ పార్టీని పైకి తీసుకు వచ్చేందుకు, అధికారం వైపు నడిపించేందుకు గట్టిగానే కష్ట పడుతున్నారు.ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు ఎప్పుడో గుర్తించారు.

అసలు ఎప్పటి నుంచో ఆయనకు తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి అప్పగించాలని చూస్తున్నా, పార్టీలోని గ్రూపు రాజకీయాలు దానికి అడ్డం పడుతూ వస్తున్నాయి.దీంతో అనవసర తలనొప్పి ఎందుకులే అన్నట్లుగా అధిష్టానం తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది.

 ఇప్పుడు మాత్రం రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి,  పార్టీని ముందుకు తీసుకు వెళ్లే బాధ్యత అప్పగించ కపోతే , కాంగ్రెస్ మరింతగా దిగజారిపోతుందని,.  ఇక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని గుర్తించిన అధిష్టానం పెద్దలు రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇదే సమయంలో బిజెపి సైతం రేవంత్ ను టార్గెట్ చేసుకుని ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.రేవంత్ వంటి దూకుడు కలిగిన నాయకుల అవసరం చాలా ఉందని, బండి సంజయ్ కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత బిజెపికి ఊపు వచ్చిందని , ఇప్పుడు రేవంత్ కూడా చేరితే ఇద్దరు పార్టీ ని అధికారం వైపు నడిపిస్తారనే అభిప్రాయంతో రేవంత్ కోసం మరింతగా కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ విషయాలన్నీ కాంగ్రెస్ అధిష్టానం గ్రహించే రేవంత్ చేజారిపోకుండా, ఆయనకు కీలక పదవి ఇచ్చి ఆయన ప్రాధాన్యం మరింత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తోందట.మరికొద్ది రోజుల్లోనే రేవంత్ కు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube