రేవంత్ కు పీసీసీ.. కోమటిరెడ్డి కి మరో పదవి ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు పేరు ప్రకటించినా, కాంగ్రెస్ లో పెద్ద యుద్ధ వాతావరణం నెలకొనెలా కనిపిస్తోంది.ఈ పదవి కోసం పెద్ద ఎత్తున పార్టీ సీనియర్ నాయకులు అంతా పోటీ పడుతుండడంతో, ఎవరికి ఈ పదవి అధిష్టానం కట్టబెడుతుంది అనేది ఒకపట్టాన అంతు పట్టడం లేదు.

 Congress Decides To Give Revanth Is Pcc President Venkatreddy As Cwc Member, Pcc-TeluguStop.com

ఖచ్చితంగా కొత్త పీసీసీ అధ్యక్ష పదవిలో ఎవరు పేరు ప్రకటించినా, పెద్ద వివాదమే చెలరేగేలా కనిపిస్తోంది.అందుకే జాగ్రత్తగా కాంగ్రెస్ పెద్దలు పదవిని భర్తీ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తమకు పదవి దక్కకపోతే, తాము పార్టీ మారేందుకు కూడా వెనకాడబోము అంటూ కొంతమంది సీనియర్ నాయకులు అధిష్టానానికి తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో, ఖచ్చితంగా పార్టీకి ఎంతో కొంత నష్టం జరుగుతుందనే అభిప్రాయంలో పార్టీ హైకమాండ్ ఉంది.

ఇప్పటికే తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు అందరి అభిప్రాయాలను సేకరించిన అధిష్టానం పెద్దలు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.వీరిలో ఒకరికి కచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుంది అనేది అందరికీ క్లారిటీ వచ్చింది.

రెండు రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ పేరు ని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే రేవంత్ ద్వారానే కాంగ్రెస్ బలోపేతం అవుతుందనే విషయాన్ని అధిష్టానం పెద్దలు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది.


Telugu Aicc, Cwc Member, Duddlllasridhar, Komati Venkata, Pcc, Revanth Reddy, Te

ఇప్పటికే పార్టీ తీరుతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కి సిడబ్ల్యుసి మెంబర్ గా అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఆ విధంగా అయినా ఆయన జాగ్రత్త పడతారనే నిర్ణయంతో ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ కు పీసీసీ దక్కకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.అయినా అధిష్టానం మాత్రం రేవంత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడంతో, కొంతమంది అప్పుడే పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube