తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు ఖరారు అయింది.పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేయనుంది.
ఇందులో భాగంగానే సీపీఐకి ఒక ఎమ్మెల్సీ సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపిందని తెలుస్తోంది.అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐ ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని సమాచారం.
మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు వద్దనుకున్న సీపీఎం ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.