రాజీవ్ పెద్ద అవినీతి పరుడు అంటూ మోడీ వ్యాఖ్యలు...ఈసీ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.మొన్నటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు ఒకరిపై నొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Congress Complaints To Ec On Modi Comments-TeluguStop.com

ఈ క్రమంలో యూపీ లోని ప్రతాప్ గఢ్ బస్తీ లోని ఎన్నికల ర్యాలీ లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.రాజీవ్ పెద్ద అవినీతి పరుడని ఆయన అనుచరులంతా రాజీవ్ గాంధీ ని మిస్టర్ క్లీన్ గా అభివర్ణించేవారని వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగుతుంది.ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మోడీ వ్యాఖ్యలపై మండిపడుతుంది.

ఈ నేపథ్యంలో ఈ విషయం పై కాంగ్రెస్ ఈసీ ని ఆశ్రయించింది.తమ మనోభవాలు దెబ్బ తినేలా మోడీ మాట్లాడుతున్నారు అని ఆయనపై చర్యలు తీసుకోవాలి అంటూ ఈసీ ని కోరింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు రానప్పటికీ ఆయన ఒక మాజీ ప్రధాని ని,భారత రత్న అవార్డు గ్రహీత ను అవమానపరిచారని పేర్కొంటూ ఈసీ కి లేఖ రాసినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో మరోసారి బహిరంగ సభలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మోడీ పై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ లేఖలో పేర్కొంది.

మరోపక్క మోడీ వ్యాఖ్యలను అకాలీదళ్ జాతీయ ప్రతినిధి మజిందర్ సింగ్ సమర్ధించారు.మోడీ చెప్పినట్లుగా రాజీవ్ పెద్ద అవినీతి పరుడే కాకుండా అతిపెద్ద మూక హత్యల ప్రేరేపకుడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube