తీరు మారని నేతలు .. కాంగ్రెస్ కు తిప్పలే తిప్పలు ?

తెలంగాణ కాంగ్రెస్ లో పదవులు పంచాయతి తేలేదిగా కనిపించడం లేదు.పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంది ? పార్టీ కోసం తాము ఎంత కష్టపడుతున్నాము ? పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి ఏ విధంగా తీసుకు రాగలము ?రాజకీయ ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలి ?ఇలా ఎన్నో అంశాలపై నాయకులు దృష్టి పెట్టాల్సి ఉన్నా, అవేవీ తమకు సంబంధం లేదన్నట్లు గా పదవుల కోసం ఒకరిపై ఒకరు యుద్ధాలకు దిగటం,  పార్టీ అధిష్టానానికి వార్నింగ్ ఇస్తూ ఉండడం, పదవి తమకు కాకుండా వేరొకరికి ఇస్తే పార్టీ మారేందుకు సైతం వెనకాడబోము అనే సంకేతాలు ఇస్తూ ఉండడం.ఇలా ఎన్నో కారణాలతో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.ప్రస్తుతం అధ్యక్ష పదవి పై ప్రతిష్టంభన కొనసాగుతోంది.ఈ పదవిలో ఎవరిని నియమించినా, పార్టీకి జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

 Pcc President Telanagana Revanth Reddy Congress Party,congressparty,jeevanreddy,-TeluguStop.com

ఈ పదవిని భర్తీ చేయకుండా వాయిదా వేసుకుంటూ వస్తే, పార్టీ మరింతగా దెబ్బతింటుందనే విషయం అధిష్టానం పెద్దలను కలవర పెడుతోంది.

అయితే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ పార్టీని ఒడ్డున పడేసేందుకు తాను చేయాల్సిన తంతు పూర్తి చేశారు.దీనిపై హైకమాండ్ కు నివేదిక ఇచ్చారు.

పిసిసి అధ్యక్షుడు ఎవరైతే  బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన అధిష్టానం పెద్దలకు వినిపించారు.దాదాపుగా రేవంత్ రెడ్డి పేరు పీసీసీ అధ్యక్షుడిగా కన్ఫామ్ అయ్యింది అనుకుంటున్న సమయంలో, అధిష్టానం పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ని సైతం ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచారు.

పిసిసి అధ్యక్ష రేసులో ఆయన పేరు కూడా ఉన్నట్టు లీక్ చేశారు.మర్రి శశిధర్ రెడ్డి పేరు కూడా చర్చకు వస్తోంది.

అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వంటి వారి పేర్లు  వినిపిస్తున్నాయి.దాదాపుగా 7, 8 మంది పేర్లు ఇప్పుడు పిసిసి లిస్టులో చేరాయి.

దీంతో మరింత ఉత్కంఠ మొదలైంది.అధిష్టానం ఎవరి పేరు ప్రకటిస్తుందనే టెన్షన్ రోజురోజుకు తెలంగాణ నాయకుల్లో పెరిగిపోతోంది.

పార్టీని పటిష్టం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా ఇప్పుడు నాయకులంతా పదవి విషయంపైనే దృష్టి పెట్టారు.ఇప్పుడు పదవి ఎవరికి దక్కి నా కాంగ్రెస్ కు నష్టమే జరుగుతుంది.

అది ఊహించని విధంగా ఉంటుంది.దీంతో అధ్యక్ష పదవి ని భర్తీ చేసి అనవసర తలనొప్పులు తెచ్చుకోవాలి అనే భయం కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube