నోటిఫికేషన్ రోజే కాంగ్రెస్ అభ్యర్ధి ప్రకటన ?  పోటీ చేసేది ఎవరు ? 

ఎట్టకేలకు హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది.నోటిఫికేషన్ కూడా అక్టోబర్ ఒకటో తేదీన ప్రకటించబోతుండడంతో హుజురాబాద్ లో ఎక్కడ లేని సందడి వాతావరణం నెలకొంది.

 Ysrcp, Jagan, Telangana, Hujurabad, Elections Notification, Revanth Reddy, Etela-TeluguStop.com

బిజెపి,  కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు ఒక్కసారిగా ఎన్నికల వ్యూహాల్లో కి దిగిపోయాయి.ఇప్పటికే అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ ను టిఆర్ఎస్ తమ అభ్యర్ధిగా ప్రకటించగా,  కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఇంకా తేలలేదు.

ఇప్పటికే రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా, పార్టీలో ఏకాభిప్రాయం రాకపోవడం తదితర కారణాలతో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు.నోటిఫికేషన్ వెలువడేబోతున్న అక్టోబర్ ఒకటో తేదీన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాలని తాజాగా నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు అభ్యర్థి ఎంపిక విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే ఇక్కడి నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కొండా సురేఖ ను పోటీకి దింపాలని చూశారు.

అయితే ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె అనేక కండిషన్లు విధించడంతో ఆమె ఎంపిక విషయంలో ఇంకా తర్జనభర్జన పడుతున్నారు.అది కాకుండా ఆమె నాన్ లోకల్ అవుతుందని చర్చ కూడా పార్టీలోనే మొదలు కావడంతో ఏం చేయాలనే విషయంపై ఏమీ తేల్చుకోలేక పోతున్నారు.

అయితే ఇక్కడి నుంచి పోటీ హోరాహోరీగా ఉండడంతో బలమైన నేతనే పోటీకి దించాలని రేవంత్ భావిస్తున్నారు.ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటో తేదీన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ తెలంగాణకు రాబోతున్నారు.

Telugu Etela Rajender, Hujurabad, Jagan, Pcc, Revanth Reddy, Telangana, Ysrcp-Te

అదే రోజున పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించాలని చూస్తున్నారు.అక్కడే కరీంనగర్ వరంగల్ జిల్లా నేతలతో సమావేశమై అభ్యర్థి ఎంపిక ఫైనల్ చేసి , అదే రోజు రాత్రి అభ్యర్థి పేరును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు .దీంతో హుజురాబాద్ నుంచి పోటీ చేయబోయేది కొండా సురేఖనా లేక మరో నేత పేరును తెరపైకి తీసుకు వస్తారా అనేది కూడా ఉత్కంఠగా మారింది.ఇదిలా ఉంటే ఇప్పటికే బిజెపి తరఫున ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

కొద్ది రోజుల పాటు ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు.అయితే అధికారకంగా బీజేపీ అభ్యర్థిగా రాజేందర్ పేరు ప్రకటించలేదు.

ఇక రాజేందర్ భార్య పేరు కూడా తెరపైకి రావడంతో పోటీలో ఎవరు ఉంటారు అనేది తేలాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube