మతపరమైన రాజకీయాలొద్దు సారు!!!

రాజకీయాల్లో కుల రాజకీయాలు, మత పరమైన రాజకీయాలు సర్వ సాధారణమే.అయితే ఒక్కోసారి అవి రేపే దుమారం అంతా ఇంతా కాదు.

 Congress And Samajvaadi Partee Fires On Mim Owaise-TeluguStop.com

విషయం ఏమిటంటే ఎమ్ ఐఎమ్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో వాటిని తీవ్రంగా ఖండిస్తున్నారు పలు పార్టీల నేతలు.అసలైతే ఈ మత ఇబ్బందులు కమలానికి ఎప్పటినుంచో ఉన్నాయి…కమలం పార్టీ హిందుత్వ పార్టీ అంటూ అనేకానేక ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయి.

ఇదే క్రమంలో ఎమ్ ఐఎమ్ అధినేత అసదుద్ధీన్ ఒవైసీ మాట్లాడుతూ సర్వ మతాలకూ మూలం ఇస్లాం.అని వ్యాఖ్యానించారు.

ఇక ఆ వ్యాఖ్యలను అటు కొంగ్రెస్ పార్టీనే కాకుండా ఉత్తరప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది.సమాజ్ వాదీ పార్టీలోని మైనారిటీ విభాగం నేతలు ఒవైసీ తీరును తప్పుపట్టారు.

ఆయన ముస్లిం ఓట్ల కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని వారు వ్యాఖ్యనించారు.సర్వమతాలకూ మూలం ఇస్లాం అని అనడం ఇతర మతాలను కించపరిచేదేనని వారు అన్నారు.

ఒవైసీ తన మాటలను వెనక్కు తీసుకోవాలని.ఒక పార్టీ అధినేతగా ఉంటూ ఇలా మాట్లాడటం పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి మాటలతో అసదుద్ధీన్ ఒవైసీ మతపరమైన రాజకీయాలకు మరోసారి ప్రాణం పోస్తున్నాడు అంటూ పలు పార్టీలు ఆయన పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.ఏది ఏమైన అవకాశం ఉంటే నాయకులంతా కుల, మాట, వర్గ, వర్ణాలని వాడేసుకునే వారేగా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube