ఈటల రాజేందర్ వ్యవహారం పై స్పందించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. కేసీఆర్‌పై ఫైర్.. ?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచిందే అందిన కాడికి దోచుకోవడానికి అని కొందరు మేధావుల అభిప్రాయమట దీనికి తగ్గట్టుగానే తెలంగాణలో రహస్యంగా జరుగుతున్న దోపిడి పై ఎన్నో సార్లు పలు సోషల్ మీడియాలో పుంఖాలు పుంఖాలుగా వచ్చినా స్పందించని ప్రభుత్వ యంత్రాంగం హఠాత్తుగా ఈటల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడం పై ప్రజల్లో చర్చాంశనీయంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 Congress And Bjp Leaders Respond To Itala Rajender Corruption Telangana, Congres-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఈ అంశం పై స్పందించిన కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్‌పై ఫైర్ అవుతున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ నేత వి.

హనుమంతరావు మాట్లాడుతూ ఈటల రాజేందర్ బీసీ నాయకుడు కాబట్టి, ఆయన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కక్షగట్టారని ఆరోపించారు.అదీగాక ఇప్పటికే టీఆర్ఎస్‌లో ఎంతోమంది నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారందరి పై ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ఇక రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులు, యంఎల్యేల పైనా కూడా విచారణ జరుపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఇకపోతే ఎప్పటి నుండో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు మల్లారెడ్డి పైనా, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ కుమార్‌లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

Telugu Bjp, Congress, Itala Rajender, Respond, Telangana-Latest News - Telugu

బీజేపీ మహిళా నేత విజయశాంతి కూడా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులపైనా విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.మొత్తానికి ఈటల వ్యవహారం టీయార్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుని ఊహించని విధంగా తెలంగాణలో రాజకీయాలు మారిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube