మాస్క్‌లు అక్కర్లేదన్న సీడీసీ: ఉన్నపళంగా ఎలా అంటోన్న జనం, అమెరికాలో కొత్త కన్‌ఫ్యూజన్

ఏడాదిన్నర పాటు దేశాన్ని వణికించిన కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా కీలక మైలురాయిని అందుకుంది.ఇకపై రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం స్పష్టం చేసింది.

 Confusion Reigns After Us Lifts Mask Guidance-TeluguStop.com

ఈ నిర్ణయంపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.కరోనాపై సుదీర్ఘ పోరాటంలో ఇదో గొప్ప రోజు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఏడాదిన్నరగా మాస్క్‌లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన సీడీసీ తాజాగా నిబంధనలు సవరించడాన్ని బైడెన్ స్వాగతించారు.రెండు డోస్‌ల వ్యాక్సిన్ పూర్తయిన వారు ఇకపై బహిరంగ, అంతర్గత కార్యకలాపాల్లో పాల్గొన్న సమయంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించాల్సిన అవసరం లేదని సీడీసీ తెలిపింది.

 Confusion Reigns After Us Lifts Mask Guidance-మాస్క్‌లు అక్కర్లేదన్న సీడీసీ: ఉన్నపళంగా ఎలా అంటోన్న జనం, అమెరికాలో కొత్త కన్ఫ్యూజన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ కొత్త నిబంధనలు ప్రజల్లో గందరగోళానికి కారణమయ్యాయి.

ఒక వ్యక్తికి రెండు టీకాలు పూర్తయినట్లు ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎదుటి వ్యక్తికి సైతం ఆ వ్యక్తికి రెండు టీకాలు తీసుకున్నట్లు తెలియదు కదా అని నిలదీస్తున్నారు.సీడీసీ నిర్ణయంతో ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతారని మండిపడుతున్నారు.

దీని వల్ల దేశం మరోసారి ప్రమాదంలో పడే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కోవిడ్ వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా 5,80,000 మంది ప్రాణాలు కోల్పోయి.అంతులేని నష్టాలను చవిచూసిన దేశంలో ఇప్పటి వరకు పాటిస్తూ వస్తున్న జాగ్రత్తల్ని ఉన్నపళంగా విడిచిపెట్టడానికి చాలా మంది సిద్ధంగా లేరు.నిజానికి సీడీసీ సిఫారస్సులకు చట్టబద్ధత వుండదు.

దీనిని స్థానిక అధికారులు లేదా యజమానులు సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది.

ఇక మాస్క్‌ల వినియోగం అమెరికాలో రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.డెమొక్రాట్లు, రిపబ్లికన్‌లు అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఇది స్పష్టమైన విభజన గీత గీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.అందుకు తగినట్లుగా శుక్రవారం కాంగ్రెస్‌లో డెమొక్రాట్ ప్రతినిధి ఎరిక్ స్వాల్వెల్‌ను మాస్క్‌ తొలగించాల్సిందిగా రిపబ్లికన్ సభ్యుడు మార్జోరీ టేలర్ కేకలు వేయడం కలకలం రేపింది.

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే.మేరీల్యాండ్, వర్జీనియాలు సీడీసీ మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు ప్రకటించగా….న్యూయార్క్, వాషింగ్టన్‌లు మాత్రం సీడీసీ గైడ్‌లైన్స్‌ను సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి.మరోవైపు సీడీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా వాషింగ్టన్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ అండ్ కల్చర్ సందర్శనలో వున్న బైడెన్ సతీమణి జిల్ బైడెన్ తన మాస్క్‌ను శుక్రవారం తొలగించారు.

అయితే ఆ మరుసటి రోజే తాము మాస్క్ లేకుండా ఉండలేకపోతున్నామంటూ ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.అధినేతల పరిస్ధితే అలా వుంటే ఇక సామాన్యుల పరిస్ధితి ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.

#Eric Swalwell #ConfusionReigns #Mask Guidance #JoeBiden #Social Distance

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు