ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యల కలకలం..!!

ఆదిలాబాద్ జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.

గుడిహత్నూర్ మండలం సీతాగోంది గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహలు లభ్యం అయ్యాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.బావిలో మృతదేహాలు యువతి, యువకుడిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితం ఇద్దరు స్కూటీప వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు.అయితే ఇరువురు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు