ఆందోళనలో జనసేన అభిమానులు, నేతలు...!!!!  

Confusion In Janasena Fans And Party Candidates-elections,janasena,pawan Kalyan,political Updates,success,voters,ycp

ఏపీలో ఎన్నికలు అయిపోయాయి. పోటెత్తిన జనం భారీ స్థాయిలో ఓట్లేశారు. విశ్లేషకులు అందరూ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం , జగన్ సీఎం అవ్వడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు..

ఆందోళనలో జనసేన అభిమానులు, నేతలు...!!!!-Confusion In Janasena Fans And Party Candidates

మరో 43 రోజుల్లో జనం నొక్కిన మీటకి రిజల్స్ కూడా రానున్నాయి. మే 23 న ప్రజా తీర్పు వైసీపీని అధికారంలో కూర్చో పెడితే, టీడీపీని ప్రతిపక్షంలో కూర్చో పెడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కి పట్టుమని 5 సీట్లు వస్తే గొప్పే, కానీసం రెండు అంకెలు కూడా దాటుకుని వెళ్తారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.

అయితే ఈ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి.?? అతడిని నమ్ముకుని ఉన్న అభిమానులు, నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏమిటి అంటే వివరాలలోకి వెళ్తే. పవన్ కళ్యాణ్ ముందు నుంచీ తన పార్టీ అధికారంలోకి రాకపోయినా ప్రజలు ఎన్ని సీట్లు ఇస్తే వారితోనే అసెంబ్లీలో ప్రభుత్వాలని ఎండగడతామని ప్రకటిస్తూ వచ్చారు. అంతేకాదు తానూ ఒక్కడినే గెలిచినా చాలు ప్రజల తరుపున మాట్లాడుతా అంటూ తనకి తానే ప్రజల మనిషిగా చెప్పుకుంటూ వచ్చారు.

అయితే అప్పట్లో అభిమానులకి గాని జనసేన నేతలకి, కార్యకర్తలకి పవన్ అభిమానం అర్థం అవ్వలేదు. కానీ ఇప్పుడు అసలు సినిమా మెల్లమెల్లగా అర్థం అవుతోంది అంటున్నారు పరిశీలకులు.

ఎన్నికలు జరిగి పట్టుమని రెండు రోజులు కూడా కాలేదు, జనసేన తరుపునుంచీ ఇప్పటి వరకూ తమకు ఎటువంటి పరామర్శ రాలేదని. ఎన్నికల సమయంలో మమ్మల్ని పట్టించుకున్న నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ ఉంటాడు, లోకల్ గా ఉన్న నేతలు మాకు మద్దతుగా నిలుస్తారు కదా అని చాలా విషయాలలో దూకుడుగా వ్యవహరించిన జనసైనికులకి ఇప్పుడు లోకల్ గా తమకి సమస్యలు వస్తే ఎవరు ఆదుకుంటారు అనే ఆందోళన నెలకొంది అంటున్నారు..

అంతేకాదు పోలింగ్ ముందు వరకూ కూడా చాలా చోట్ల టీడీపీ నేతలు పవన్ అభిమానులని నయానో భయానో బెదిరించి మరీ తమవైపుకి తిప్పుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఆ సమయంలో కూడా జనసేన నుంచీ వారికి ఎటువంటి మద్దతు లేకపోవడంతో అప్పుడే లేని మద్దతు భవిష్యత్తులో ఎలా ఉంటుంది తమ పరిస్థితి ఏమిటి అనే టెన్షన్ వారిలో నెలకొందట. దాంతో టీడీపీ నేతలు పెట్టే ఇబ్బందుల నుంచీ తప్పించుకోవడానికి జగన్ కి జై కొట్టడానికి చాలా నియోజకవర్గాలలో జనసైనికులు సిద్దంగా ఉన్నారట.

త్వరలో మూకుమ్మడిగా జనసేన నుంచీ వైసీపీలో భారీ చేరికలు క్రిందిస్థాయి నుంచీ ఉంటాయని, ముఖ్యంగా యువత జగన్ కి మద్దతుగా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎంతో కమిట్మెంట్ తో పని చేసిన యువకులు అందరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఎన్నికల తరువాత సరైన భరోసా జనసేన నుంచీ లేకపోవడమే అంటున్నారట. మరి ఎంతమంది జనసైనికులు జగన్ చెంతకి చేరుతారో వేచి చూడాలి..