తిరుపతి పై జనసేన, బీజేపీ, టీడీపీ లో గందరగోళం ?  

Confusion in Janasena BJP and TDP over Tirupati by-election , Tirupati by-elections , Janasena, BJP, TDP, Political parties, Pawan kalyan, Chandrababu naidu - Telugu Balli Durga Prasad, Chandrababu, Ghmc, Jagan, Janasena, Kcr, Pavan Kalyan, Tdp, Tirupathi, Ysrcp

తెలంగాణలో ఎన్నికల సందడి ఏవిధంగా ఉందో ఇప్పుడు ఏపీ లోనూ ఎన్నికల సందడి అదేవిధంగా కనిపిస్తోంది.ఇంకా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు రాకముందే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గట్టిగానే హడావుడి చేస్తున్నాయి.

TeluguStop.com - Confusion In Janasena Bjp And Tdp Over Tirupati By Elections

ఇప్పటి నుంచి గెలుపుకు బాటలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నాయి.తిరుపతి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో , ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యం కాబోతున్నాయి.

ఇక్కడ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే బిజెపి, జనసేన , టిడిపి ఈ విషయంలో కాస్త గందరగోళానికి గురవుతున్నట్టు గా కనిపిస్తున్నాయి.

TeluguStop.com - తిరుపతి పై జనసేన, బీజేపీ, టీడీపీ లో గందరగోళం -General-Telugu-Telugu Tollywood Photo Image

ఏపీ లో బిజెపి, జనసేన పార్టీలు పొత్తు ఉన్న నేపథ్యంలో కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని, తెలంగాణలో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయాలని చూస్తున్నాయి.ఏపీ లో బిజెపి టిడిపిల మధ్య రాజకీయ వైరం ఉండగా, తెలంగాణలో ప్రస్తుతం జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి , బిజెపి కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి.

ఇంకా పొత్తు ఖరారు కానప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కానీ, పొత్తు కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.అయితే ఏపీ విషయానికి వచ్చేసరికి ఈ పార్టీలు ఏవిధంగా పొత్తు పెట్టుకోవాలి అనే విషయంలో క్లారిటీ తెచ్చుకో లేకపోతున్నాయి.

తిరుపతిలో బిజెపి జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, బిజెపితో పొత్తు పెట్టుకోవాలని టిడిపి తహతహలాడుతోంది.

వీటిలో కొన్ని పార్టీల మధ్య పొత్తు కుదిరినా, ఉమ్మడి అభ్యర్థిగా తమకు సంబంధించిన వారే ఉండాలని మరో పార్టీ పట్టు పడుతూ ఉండటంతో కాస్త గందరగోళం నెలకొన్న ట్టుగా కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీకి దిగే సమయంలో, బీజేపీ ఒంటరిగానే పోటీ చేసింది.జనసేన సైతం ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది.

కానీ విజయం దక్కించుకోలేక పోయాయి.మళ్లీ ఇప్పుడు రకరకాలుగా పొత్తు పెట్టుకునేందుకు అన్ని పార్టీలు సిద్దమవుతుండటంతో , గందరగోళం నెలకొంది.

ఏపీలో ఒక విధంగా , తెలంగాణలో మరో విధంగా అన్ని రాజకీయ పార్టీలు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్న తీరు జనాల్లో ఆ పార్టీలను చులకన చేస్తున్నాయి.ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని చంద్రబాబుకు ఖరారు చేసినప్పటికీ, బీజేపీతో లోపాయికారికంగా పొత్తు పెట్టుకునేందుకు ఆయన తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండటం , ఇక బిజెపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని చూస్తున్నా , ఏ పార్టీ తరఫున అభ్యర్థిని రంగంలోకి దించాలనే విషయంలో క్లారిటీ దొరక్కపోవడం ఇలా గజిబిజి గందరగోళం గా , ఇక్కడ పరిస్థితులు నెలకొన్నాయి.

దీన్నే అవకాశంగా తీసుకుని మరోసారి ఇక్కడ సత్తా చాటాలనే ఆలోచనలో ఏపీ అధికార పార్టీ వైస్సార్సీపీ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

#Jagan #GHMC #Janasena #Chandrababu #Tirupathi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Confusion In Janasena Bjp And Tdp Over Tirupati By Elections Related Telugu News,Photos/Pics,Images..