కొత్త సినిమా ప్రకటనలకు దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.కొంతమంది స్టార్ హీరోల తర్వాత సినిమాలకు సంబంధించిన ప్రకటనలు రావడంతో పాటు ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తున్న హీరోల జాబితా అంతకంతకూ పెరుగుతోంది.

 Confusion About These Star Heroes Future Projects Details Here , Allu Arjun , Ak-TeluguStop.com

అయితే కొంతమంది స్టార్ హీరోలు మాత్రం కొత్త సినిమాల ప్రకటనలకు దూరంగా ఉన్నారు.డైరెక్టర్లు చెబుతున్న కథలు నచ్చకపోవడం వల్లే ఈ హీరోలు కొత్త సినిమాలను ప్రకటించడం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్టార్ హీరో నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు.పెట్టిన పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమా మంచి లాభాలను అందించింది.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమాలో నాగ్ నటిస్తుండగా ఈ సినిమా తర్వాత నాగ్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటన వెలువడలేదు.ఈ సినిమాతో పాటు బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నాగ్ నటిస్తున్నా ఆ సినిమాలో నాగ్ పాత్ర నిడివి తక్కువనే సంగతి తెలిసిందే.

వెంకటేష్ నటించిన ఎఫ్3 మే నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాతో పాటు వెంకటేష్ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.సల్మాన్ సినిమాలో వెంకటేష్ చిన్న పాత్రలో నటించనున్నారని బోగట్టా.ఎఫ్3 ప్రమోషన్స్ లో వెంకటేష్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. రానా నటించిన విరాటపర్వం త్వరలో రిలీజ్ కానుండగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కు కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Telugu Akhil, Allu Arjun, Projects, Ghost, Nagarjuna, Rana, Tollywood-Movie

అయితే రానా కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.అఖిల్ సైతం ఏజెంట్ మినహా మరో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించకపోవడం గమనార్హం.మరో స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో త్వరలో నటిస్తుండగా ఈ స్టార్ హీరో పలువురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరి డైరెక్షన్ లో తర్వాత సినిమాలో నటిస్తారనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube