కోల్ కతా లో బెడిసికొట్టిన అమిత్ షా రోడ్ షో...ఉద్రిక్తతలు!

కేంద్రం లో అధికారంలో బీజేపీ కి కోల్ కతా లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే అంత శత్రుత్వం ఉంది.ఇటీవల ఫణి తుఫాన్ సమయంలో కూడా తీవ్రంగా నష్టపోయినప్పటికీ ప్రధాని మోడీ తో మాట్లాడడానికి కూడా ఇష్టపడని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రం సాయం కూడా అడుగలేదు.

 Conflicts In Amit Shah Road Show In Kolkata-TeluguStop.com

ఇటీవల 7 రాష్ట్రాల్లో ఆరో దశ పోలింగ్ సమయంలో కూడా బీజేపీ నేత పై తృణమూల్ కార్యకర్తలు దాడి కి దిగడం తో అక్కడ పోలింగ్ సమయంలో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందే తృణమూల్ కార్యకర్తలు,బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

దీనితో అమిత్ షా రోడ్ షో మధ్యలోనే నిలిచిపోయింది.చివరి విడుత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న పశ్చిమ బెంగాల్ లో మిగిలిన 9 సీట్లకు పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమిత్ షా కోల్ కతా లో రోడ్ షో నిర్వహించారు.దీనికోసం జనాలను కూడా సమీకరించారు.

కోల్ కతా లోని ఎస్ ప్లేనేడ్ నుంచి స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటివరకు రోడ్ షో జరగాలి.అయితే మధ్యలో ఉన్న విద్యాసాగర్ కాలేజీ వద్దకు ప్రదర్శన చేరుకోగానే ఘర్షణ మొదలైంది.

దీంతో ఆగ్రహం తో ఊగిపోయిన బీజేపీ కార్యకర్తలు ఇక అదుపుతప్పి విధ్వంసానికి దిగారు.కాలేజీ వెలుపల పార్కింగ్ చేసి ఉన్న మోటార్ సైకిళ్ళ కు నిప్పు పెట్టారు.

కర్రలు, రాళ్లతో హాస్టల్లో ఉన్న వారిపై దాడికి దిగడమే కాకుండా కాలేజీ లాబీలోని ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.దీనితో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది షా ను సురక్షిత ప్రదేశానికి తరలించారు.కోల్ కతా లో మంగళవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్తత నెలకొంది.

రోడ్లపై అతికించిన బీజేపీ పోస్టర్లను పోలీసులు తొలిగించడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు కైలాశ్ విజయ వర్గీయ, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బైఠాయించారు.మహిళలు సంప్రదాయ బెంగాలీ దుస్తుల్లో, గిరిజనులు బాణాలు, విల్లంబులతో వచ్చారు.

మరికొంద రు రాముడు, హనుమంతుడు తదితర వేషాలతో పాల్గొన్నారు.ఆ మార్గమంతా కూడా జై శ్రీరాం, మోడీ అన్న నినాదాలతో దద్దరిల్లింది.

ఈ సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడం తో రోడ్ షో నిలిచిపోయింది.మరోవైపు సోమవారం జాధవ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అమిత్ షా ఎన్నికల ప్రచారానికి మమతా సర్కార్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

కనీసం షా ఛాపర్ దిగేందుకు కూడా అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పడం తో సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.అయితే అక్కడ కూడా బీజేపీ నేతలకు నిరాశే ఎదురైంది.

శాంతి భద్రతల విషయం తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అమిత్ షా యాత్రకు మమత ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు కోర్టు కూడా స్పష్టం చేయడం తో .సోమవార్మ జరగాల్సిన ర్యాలీ జరగలేదు.దీనితో తృణమూల్ కాంగ్రెస్ తీరు కు నిరసన గా బీజేపీ సేవ్ రిపబ్లిక్ ర్యాలీ ని నిర్వహించింది.ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రోడ్ షో నిర్వహించగా ఆ సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

దీనితో రోడ్ లో మధ్యలోనే ఆగిపోయింది.అయితే బీజేపీ నేతలు మాత్రం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న భయం తోనే మాపై దాడులకు దిగుతున్నారు అంటూ తృణమూల్ కాంగ్రెస్ నేతలపై కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఘర్షణల్లో పలువురు గాయపడినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube