ఉదయభాను తో నాకు జరిగిన గొడవ అదే: సింగర్ సునీత

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే దానిలో హీరో,హీరోయిన్ పాత్ర ఎంతగా ఉంటుందో ఆ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ పాత్ర కూడా అంతే ఉంటుంది.అలాగే ఆ సినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ఏదైనా హిట్ అయింది అంటే ఆ సాంగ్ పాడిన సింగర్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.

 Conflicts Between Singer Sunitha And Anchor Udayabhanu-TeluguStop.com

అలాంటి చాలామంది సింగర్స్ వాళ్ల గాత్రంతో ఎన్నో సాంగ్స్ ను హిట్ చేసి చూపించారు, అలాంటి వారిలో లెజెండరి సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యం  జేసుదాసు, హరిహరన్ లాంటి చాలా మంది సీనియర్లు వాళ్ల గాత్రంతో ఎన్నో సాంగ్స్ కి ప్రాణం పోశారు.ఫిమేల్ సింగర్ లలో ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా సునీత అనే చెప్పాలి.

కృష్ణవంశీ డైరెక్షన్లో జెడి చక్రవర్తి, మహేశ్వరి హీరోహీరోయిన్లుగా వచ్చిన గులాబీ సినిమా లో తను ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావో అనే పాట పాడింది.ఈపాటతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

 Conflicts Between Singer Sunitha And Anchor Udayabhanu-ఉదయభాను తో నాకు జరిగిన గొడవ అదే: సింగర్ సునీత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత చాలా సినిమాల్లో మంచి మంచి సాంగ్స్ పాడి సింగర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించింది.

యాంకర్ ప్రదీప్ హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తీశాడు ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు అందులో నీలి నీలి ఆకాశం అనే సాంగ్ చాలా పాపులర్ అయ్యింది ఆ సాంగ్ ని కూడా సునీత పాడారు.

ప్రస్తుతం ఆవిడ చాలా సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా ఉన్నారు.ఇదిలా ఉంటే సునీత  ఒక షో నీ ఆర్గనైజ్ చేశారు ఆ షోకి హోస్ట్ గా ఉదయభాను వ్యవహరించారు.

అయితే ఆవిడ ఎంట్రీ ఇచ్చినప్పుడు సునీత గారి మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తం ఉదయభాను ఎంట్రీకి సాడ్ మ్యూజిక్ ని ప్లే చేశారని దాంతో ఆవిడ హర్ట్ అయిందని సునీత అన్నారు.అయితే ఈ విషయం తనకి ఎలా తెలిసింది అంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను సింగర్ గురించి ప్రస్తావిస్తూ ఒకరు తనకి ఇలా చేశారు అని చెప్పింది అయితే చాలా వెబ్ సైట్ వాళ్ళు యూట్యూబ్ వాళ్లు ఆ విషయంలో సునీత ప్రస్తావన తీసుకు వచ్చి చాలా కథనాలు రావడంతో జరిగిన విషయం ఇదా అని అప్పుడు సునీత గారికి అర్థం అయింది అంట అందుకే తను తర్వాత కూడా నాతో సరిగ్గా మాట్లాడలేదు అని సునీత చెప్పారు ఇప్పటికీ ఉదయభాను గురించి మాట్లాడుతూ అది నేను అయితే కావాలని చేయలేదు అలాంటిది ఏదైనా ఉంటే నాతో డైరెక్ట్ గా మాట్లాడితే సరిపోయేది ఆ మాత్రం దానికి మనసులో పెట్టుకొని బాధపడటం అనేది కరెక్ట్ విషయం కాదేమో అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

Telugu @officialsunitha, 30 Rojullo Preimincham Ela Event, Gulabi Movie, Host For Event, Singer Sunitha, Social Media, Tollywood, Udayabhanu, Yanker Udyabanu-Telugu Stop Exclusive Top Stories

అలాగే సునీత మాట్లాడుతూ ఇంతకుముందు ఉషా గారితో కూడ నాకు గొడవలు ఉన్నాయని చాలా మంది చాలా కథలు రాశారు.కానీ నాకు ఎవరితో ఏం గొడవలు లేవు.మొదటి నుంచే ఉష నాతో అంత కంఫర్టబుల్ గా ఉండేవారు కాదు దాంతో నేను కూడా ఎప్పుడు ఆవిడ్ని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు.అయిన సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఎవరికి వచ్చేవి వారికి వస్తాయి.

ఒకరికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి మనకు రావట్లేదు అని మనసులో పెట్టుకొని నేను ఏదో చేసేదాన్ని అయితే కాదు అని చెప్పారు.ఏదేమైనప్పటికీ ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ జరగడం అనేవి కామన్.

ప్రస్తుతం సునీత రామ్ వీరపనేని గారిని పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు.ప్రస్తుతం సునీత పెళ్లి తర్వాత కూడా సింగర్ గా తన హవాని కొనసాగిస్తున్నారని చెప్పాలి.

కొత్త సినిమాలకి సాంగ్స్ పాడుతూ బిజీగా తన లైఫ్ ని గడుపుతున్నారు.

#Singer Sunitha #Yanker Udyabanu #Udayabhanu #Host For Event #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు