టీఆర్ఎస్‎లో వర్గపోరు..ఎమ్మెల్యేల, మున్సిపల్ చైర్మన్‎ల మధ్య విభేదాలు..

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‎లో వర్గపోరు భగ్గుమంది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిర్యాలగూడలో రాజకీయం వేడెక్కుతోంది.

 Conflicts Between Classless Mlas And Municipal Chairmen In The Trs  Mlas, Trs Pa-TeluguStop.com

ఎమ్మెల్యేల, మున్సిపల్ చైర్మన్ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.దీంతో ఇరు నాయకులు మున్సిపాలిటిపై పట్టు సాధించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిర్యాలగూడలో రాజకీయం వేడెక్కుతోంది.ఎమ్మెల్యే, ఆయన బినామీలు పెత్తనం సాగించడాన్ని మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ అనుచరులు వ్యతిరేకిస్తున్నారు.

ఎలాగైనా సరే మిర్యాలగూడ మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు.టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మిర్యాలయగూడ నియోజకవర్గ రాజకీయం పూర్తిగా మారింది.

స్థానికంగా ఉన్న కొంతమంది ప్రజా ప్రతినిధులు తమ సొమ్ము రాబట్టుకునేందుకు బినామిలు, కాంట్రాక్టర్‎లను రంగంలోకి దించారు.తమ బంధువుల్లో కొందరి పేర్లతో గంపగుత్తగా పనులు దక్కింకుంటున్నారు.

దీంతో కొంతమంది ప్రజాప్రతినిధులకు నిరాశ మిగులుతుంది.

ఇక మున్సిపల్ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు సాగర్ రోడ్‎లో ఓ భవంతిని నిర్మిస్తున్నారు.

ఈ భవంతిని మున్సిపల్ అధికారులు కూల్చేశారు.ఛైర్మన్ వర్గీయులకు చెందిన వెంచర్, అందులోని నిర్మాణాలను సైతం రెవెన్యూ అధికారులు కూల్చేశారు.చేశారు.దీంతో ఎమ్మెల్యే వర్గీయులే తమ నిర్మాణాలను కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Bhaskar Rao, Miryalaguda, Mlas, Chairmen, Trs, Ts Poltics-Political

అటు మిర్యాలగూడ తహసీల్దార్ తీరును కూడా చైర్మన్ భార్గవ్ తీవ్రంగా ఖండించారు.బాధితులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సైతం ముట్టడించారు.అయితే నిర్మాణాల కూల్చివేతలో తన ప్రమేయం లేదని ఎమ్మెల్యే భాస్కర్ రావు వివరణ ఇచ్చారు.అయితే ఎమ్మెల్యే భాస్కరరావు ,చైర్మన్ భార్గవ్ మధ్య పోరు చివరికి అధికారులు బలయ్యే పరిస్థితి దాపరించింది.అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారంలో ఓ అధికారిని స్థానిక ప్రజా ప్రతినిధి మందలించినట్లు సమాచారం.

దీంతో సదరు అధికారి సెలవు పెట్టి వెళ్లిపోయారని, త్వరలోనే బదిలీ వేటు పడుతుందని సొంత కార్యాలయ ఉద్యోగులు అనుకోవడం గమనర్హం.ఏదీ ఎమైనా అధికార పార్టీలో నెలకొన్న వర్గ పోరు నెలకొవడంతో పార్టీ కింది స్థాయి శ్రేణులు నలిగిపోతున్నారు.

ఎవరికి మద్దతు పలకాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube