గరం గరంగా మారిన గుడివాడ రాజకీయం ?

ఏపీ రాజకీయాలు వేడెక్కాయి .ఒకపక్క ఉద్యోగులు ప్రభుత్వం మధ్య పిఆర్సి విషయంలో రగడ జరుగుతుండగానే, మరో పక్క వైసీపీ మంత్రి కొడాలి నాని నియోజకవర్గమైన గుడివాడలో నాని కి చెందిన కన్వెన్షన్ సెంటర్ పరిశీలించేందుకు తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీ వెళ్ళింది.

 Conflict Between Tdp And Ycp In Gudivada , Gudiwada, Kodali Nani, Cesino Club, K-TeluguStop.com

కొడాలి నాని కి చెందిన కన్వెన్షన్ లో జోరుగా జూదం నడుస్తోందని టీడీపీ ఆరోపణలు చేయడంతో పాటు,  దీనిని నిర్ధారించేందుకు ఒక కమిటీని సైతం నిర్మించింది.ఈ కమిటీ ఈరోజు గుడివాడలో నాని కి చెందిన కన్వెన్షన్ కు వెళ్లే సమయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.

ముందుగా బైపాస్ రోడ్డు వద్ద టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో కేవలం కేవలం పది వాహనాలను మాత్రమే గుడివాడ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.

నేరుగా వారంతా టీడీపీ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి నాని కి చెందిన కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లారు .అప్పటికే అక్కడ వైసిపి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో , టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పాటు,  మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమా కారు అద్దాలు ధ్వంసం చేశారు .దీంతో పరిస్థితి చేయి దాటి పోతుంది అని భావించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు.

మహానుభావులు పురిటిగడ్డ గుడివాడ ను భ్రష్టు పట్టించింది గడ్డం గ్యాంగ్.మింగడానికి ఏమీ మిగలదు ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు లూటీ చేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేశారు.కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా, వైసీపీ రంగులతో కళ్ళు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదు.క్యాసినో నడిపి ప్రజల నుండి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలేసి నిజ నిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ‘ అంటూ లోకేష్ కామెంట్ చేశారు.

Gudiwada, Kodali Nani, Cesino Club, K Convention, Gudiwada Politics, Nara Lokesh, Bonda Uma, - Telugu Bonda Uma, Cesino Club, Gudiwada, Kodali Nani, Lokesh

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube