వక్షోజాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

వక్షోజాలు కొందరు స్త్రీలలో పెద్దగా ఉంటాయి, మరికొందరికి చిన్నగా ఉంటాయి.కొందరికి పెద్దగా అవుతుంటాయి, మరికందరికి చిన్నగా అవుతుంటాయి.

 Condition Of Breasts Can Determine Health Condition-TeluguStop.com

కొందరికి వక్షోజాల దగ్గర మంటగా ఉంటుంది, మరికొందరి వక్షోజాలు సెన్సిటివ్ గా అయిపోతాయి.చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, వక్షోజల స్థితి అరోగ్య స్థితిని కూడా తెలుపుతుంది.

మీ వక్షోజాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి మరి.

* చిన్నగా అవుతున్నాయా?

వక్షోజాల సైజ్ చిన్నగా అయిపోతుంటే స్త్రీ స్ట్రెస్ సమస్యతో తీవ్రంగా ఇబ్బందిపడుతోంది అన్నమాట.PCOS, హైలోథైరాడిజమ్ లాంటి డిజార్డర్స్ వచ్చినప్పుడు కూడా వక్షోజాలు చిన్నగా అవుతాయి.

* పెద్దగా అవుతున్నాయా ?

బరువు పెరగటం, పెరగకపోవటంతో సంబంధం లేకుండా, వక్షోజాల పరిమాణం పెరుగుతూ ఉంటే, హార్మోన్‌లలో సమతుల్యత లోపించిందని అర్థం.అలాగే ఇది ప్రెగ్నెన్సికి ఒక సూచన కూడా.

* వక్షోజాల కింద మంటగా ఉంటోందా?

వక్షోజాల కింద మంటగా ఉంటే దానికి ఇంఫెక్షన్స్ కారణం కావచ్చు.చెమట సమస్య ఎక్కువున్న వారికి కూడా ఇలా జరుగుతుంది.

* వక్షోజాలు సెన్సిటివ్ గా ఉంటే?

వక్షోజాలు లోనికి పోయినట్లుగా, చాలా సెన్సిటివ్ గా అనిపిస్తే, అది గర్భానికి సూచన కావచ్చు, అలాగే PMS యొక్క లక్షణం కావచ్చు.అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకొమ్మని వక్షోజాల నుంచి వచ్చిన హెచ్చరిక కావచ్చు.

* నిపుల్స్ చుట్టూ వెంట్రుకలు పెరుగుతున్నాయా?

నార్మల్ గా నిపుల్స్ చుట్టూ, వెంట్రుకలు పెరిగితే ఫర్వాలేదు కాని, ఇలాంటి కండీషన్ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే PCOD టెస్ట్ చేయించుకోవాలి.

* నిపుల్స్ నుంచి ద్రవాలు ఊరుతున్నాయా ?

నిపుల్స్ నుంచి గట్టిగా, తెల్లగా ఓ పదార్థం ఊరితే అది కామోద్రేకానికి సంకేతం కావచ్చు లేదంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ కావచ్చు.

* వక్షోజాల ఉబ్బినట్టు అనిపిస్తున్నాయా?

వక్షోజాలు ఉబ్బినట్టు అనిపించినా, దద్దుర్లు లాంటివి ఏర్పడినా, ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా, వెంటనే బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని వక్షోజాలు ప్రాధేయపడినట్లు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు