బాబోయ్ ' గుర్తు ' లు  గుర్తుకొస్తున్నాయ్ ! హడలెత్తిస్తున్నాయ్ ! 

హుజురాబాద్ ఎన్నికల్లో ఒక పార్టీపై మరో పార్టీ పట్టు సాధించేందుకు ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి.ముఖ్యంగా ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, టిఆర్ఎస్ అభ్యర్థి పై గెలిచి తన సత్తా చాటుకోవాలని రాజేందర్ ప్రయత్నిస్తున్నారు.

 Concern Of Major Parties Over Election Symbols In Huzurabad Elections Trs, Telan-TeluguStop.com

దీంతో పోటీ రసవత్తరంగా మారింది.  అన్ని పార్టీలు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ  ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలను ఇప్పుడు ఎన్నికల గుర్తులు ఆందోళన కలిగిస్తున్నాయి.కొద్ది నెలల క్రితం జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎన్నికల గుర్తులు అధికార పార్టీ టిఆర్ఎస్ ఓటమి కి కారణం అయ్యాయి.

స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల దృష్ట్యా టిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు సింబల్ ను పోలి ఉండటంతో చాలా ఓట్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళిపోయాయి.
        దీనిపై టిఆర్ఎస్ కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.

అయితే ఇప్పుడు హుజురాబాద్ లో జరగబోతున్న ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు టిఆర్ఎస్ గుర్తు అయిన కారు , బీజేపీ గుర్తుగా ఉన్న కమలం  గుర్తులను స్వతంత్ర అభ్యర్దులు ఎంచుకోవడం తో,   ప్రధాన పార్టీల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.ఇప్పటికే ఈటెల రాజేందర్ పేరు ను పోలి ఉన్న మరో ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు.

వారు ఇప్పుడు తమ ఎన్నికల గుర్తు కూడా బిజెపి సింబల్ ను పోలి ఉండేలా ఆ ముగ్గురు అభ్యర్థులు దాఖలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.హుజురాబాద్ ఎన్నికల్లో కారు సింబల్ ను పోలి ఉన్న రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతీ రోలర్, ఆటోరిక్షా , ఇస్త్రీ పెట్టె, బస్సు, లారీ గుర్తులు టిఆర్ఎస్ కు బాగా నష్టం చేకూర్చాయి.
     

Telugu Congress, Symbols, Etela Rajender, Hujurabad, Telangana-Telugu Political

  వీటిపై టిఆర్ఎస్ ఫిర్యాదు చేయడంతో ట్రక్కు,  రోలర్,  ఆటో సింబల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది.కానీ కారును పోలి ఉన్న చపాతీ రోలర్, ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టె, బస్సు ,లారీ గుర్తులను అందుబాటులోనే ఉంచింది.వీటిని కొంత మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపిక చేసుకున్నారు.  ఇక బిజెపి ఎన్నికల గుర్తు కమలం ను పోలి ఉన్నట్లుగా కాలీఫ్లవర్,  ఫైన్ యాపిల్  గుర్తులను ఈటెల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న పేరు కలిగిన స్వతంత్ర అభ్యర్థులు ఎంపిక చేసుకోవడంతో ఎన్నికల గుర్తులు తప్పనిసరిగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు నష్టాన్ని చేకుర్చుతాయి అనే ఆందోళన ప్రధాన పార్టీల్లో నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube