ఆమెకి 11 మంది భర్తలు, బాయ్‌ఫ్రెండ్స్‌కి లెక్కే లేదు..! ఇలాంటి వారిని ఏం చేయాలి.?  

  • మాటలతో మత్తెకిస్తుంది. ముగ్గులోకి దింపుతుంది. ప్రేమించుకుందాం… ప్రేమంటే ఇదేరా అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చి పెళ్లి చేసుందాం రా అని పిలుస్తుంది. ఆ మాటలను నమ్మి పెళ్లి పీటలెక్కి తాళి కడితే చాలు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. తాజాగా ఓ మహిళ 11 మంది వ్యక్తులను పెళ్లి చేసుకుంది. ఇంకా ఆమెకు బాయ్‌ఫ్రెండ్స్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివరాల్లోకి వెళితే

  • కేరళలోని కొచ్చి నగరానికి చెందిన లోరెన్ జస్టిన్ అనే వ్యక్తి, తన భార్య మేఘా కొన్నాళ్లుగా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మేఘా కనిపించకుండా పోయినప్పటి నుంచి ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల డబ్బు, బంగారం కూడా మాయమైందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అతని దగ్గరున్న ఫోటోల ద్వారా ఆమె ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో పోలీసులకు చిక్కింది మేఘా భార్గవ్. ఆమెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  • Con Bride Who Married And Duped 11 Men In Kerala-20-day Affairs Con Kerala Lady Megha Bhargav

    Con Bride Who Married And Duped 11 Men In Kerala

  • ఈ యువతి నిత్య పెళ్లి కూతుళ్ల జాబితాలో నెం.1 స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమించినట్టుంది. అందుకే, ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది అబ్బాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకుని నిండా ముంచింది. ఈ యువతి బాగోతం గురించి తెలిసిన ఈ 11 మందిలో చివరివాడైన వాడు కేరళలోని కొచ్చికి చెందిన లోరెన్ జస్టిన్.

  • పోలీసుల కథనం ప్రకారం… భార్గవ్ తగిన పరిశోధన అనంతరం సంపన్నుడైన యువకుడ్ని ఎంచుకుంటుంది. అందులోనూ వివాహానికి ప్రతికూలతలతో ఉన్నవారిని గుర్తిస్తుంది. డబ్బులుండీ, పెళ్లికి శారీరక లోపం, నల్లగా ఉండి పెళ్లి కుదరకపోవడం, ఇంకా మరేదైనా లోపంతో బాధపడుతున్న వారిని ఎంచుకున్న తర్వాత వారిని ముగ్గులోకి దింపుతుంది. చక్కగా పెళ్లి చేసుకుని వారితో స్వల్ప కాలం పాటు వైవాహిక జీవితం గడుపుతుంది. ఒకానొక శుభ ముహూర్తాన మొగుడికి మత్తు మందు కలిపిన పానీయం తాగించి ఇంట్లో ఉన్న సంపదనంతా ఊడ్చుకుని పరారవుతుంది.

  • Con Bride Who Married And Duped 11 Men In Kerala-20-day Affairs Con Kerala Lady Megha Bhargav
  • ఇలా ప్రాంతాలు మారుస్తూ ఒకరికి తెలియకుండా మరొకరికి మొత్తం 11 మందిని పెళ్లి చేసుకుంది మేఘా. ఒక్క కేరళ రాష్ట్రంలోనే నలుగురు యువకులు మేఘా మాయలో పడి మోసపోయారు. ఈమెకు ఆమె చెల్లి, బావ సపోర్ట్ కూడా ఉండడంతో పక్కా ప్లానింగ్‌తో ఛీటింగ్ స్కెచ్ గీసేవాళ్లు. పెళ్లికి ముందే కొందరిని ప్రేమ పేరుతో నమ్మించి, అందిన కాడికి దోచుకున్నట్టు తేలింది.