టఫ్ ఫైట్ తప్పదా ? అయితే వారిని లాగేద్దాం  

Compulsory Fight Lets Pull Them-compulsory Fight,elections,history,may 23rd,political Updates,results,అయితే వారిని లాగేద్దాం

పోలింగ్ పూర్తయినా ఎన్నికల ఫలితాల కోసం ఇంతకాలం వెయిట్ చేయడం బహుశా దేశ ఎన్నికల చరిత్రలో ఇది రెండో సారెమో. ఏపీలో ఫలితాల ప్రకటన వచ్చే మే 23 వ తేదీ కోసం అంతా ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. స్పష్టంగా ఎవరికీ విజయం దక్కుతుందో ? ఎవరికీ దక్కదో స్పష్టంగా ఎవరి ఊహకు అందడంలేదు. ప్రతి పార్టీ తమకు 100 కు పైగా సీట్లు వస్తాయంటూ ధీమాగా చెప్పేస్తున్నాయి. అయితే వాస్తవంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడంలేదు...

టఫ్ ఫైట్ తప్పదా ? అయితే వారిని లాగేద్దాం-Compulsory Fight Lets Pull Them

ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలతో టీడీపీ పరాజయం ఖాయమని, వైసీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. కానీ తమదే విజయమని టీడీపీ వాదిస్తోంది.

ఆ సంగతి అలా ఉంటే ఎవరికైనా 90కి అటూ ఇటూగా అసెంబ్లీ స్థానాలు కనుక వస్తే మిగిలిన సీట్లు ప్రతిపక్షానికి వస్తే రెండు పార్టీలకు చాలా ఇబ్బందికర పరిణామమే. అప్పుడు జంప్ జిలానీల బెడద కూడా ఎక్కువ అవుతుంది.

అందుకే ముందుగానే పక్క పార్టీల్లో గెలుస్తారు అని నమ్మకమున్న అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో రెండు పార్టీలు నిమగ్నం అయ్యాయి. కనీసం ఓ పదిమంది గెలుపు గుర్రాలను తమ పార్టీలో చేర్చుకోవాలని ఆలోచనలో వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ నేతలకు ఇప్పటికే ఈ తరహా సమాచారం రావడంతో.

చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

అందుకే హుటాహుటిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్దులందరితో టచ్ లో ఉండాలని చంద్రబాబు ఆయా జిల్లాలోని కీలక నాయకులకు ఆదేశాలు జరీ చేసాడట. కొంతమంది వైసిపి నాయకులు సెక్రటేరియట్ లోని కొంతమంది అధికారులకు ఫోన్ చేసి ఫైళ్ల కదలికలపై చేస్తున్న సూచనలు ఆరా తీస్తున్న తీరు గురించి కూడా తెలుగుదేశం లో కలవరం పుట్టిస్తోందట. అందుకే వైసీపీ కి అధికారం దక్కకుండా చేసేందుకు వైసీపీలో ఖచ్చితంగా గెలుస్తారు అనుకున్న ఓ పదిమంది ఎమ్యెల్యేలతో టీడీపీ నాయకులు మంతనాలు చేస్తున్నారట.

వారు కూడా జగన్ దగ్గర అవమానాలు పొందినవారేనని సమాచారం. మీరు తమ పార్టీకి మద్దతు ఇస్తే రాజకీయంగా, ఆర్థికంగా అన్నిరకాలుగా మిమ్మల్ని ఆడుకుంటాము అంటూ భరోసా కూడా కల్పిస్తూ తమ వైపుకి తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది.