అఘోర పాత్రలపై పూర్తి రీసెర్చ్ చేశా.. ఆ పాట కోసం నెల సమయం పట్టింది.. థమన్

Complete Research On Agora Characters It Took A Month For That Song Thaman

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటించిన  సంగతి తెలిసిందే.ఇందులో ప్రగ్యా జైస్వాల్  హీరోయిన్ గా నటించింది .

 Complete Research On Agora Characters It Took A Month For That Song Thaman-TeluguStop.com

ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు .ఇదిలా ఉంటే ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానున్న సందర్భంగా ప్రమోషన్ లో భాగంగా తమన్ కొన్ని విషయాలు పంచుకున్నాడు.

ఈ సినిమాలో చాలా మార్పులు కాలానికి తగ్గట్టుగా మార్చుకుంటూ వచ్చామని.సినిమా విడుదల సమయం తగ్గట్టు మ్యూజిక్ ఉండాలన్న ఉద్దేశంతో రీరికార్డింగ్ చేశానని తెలిపాడు తమన్.ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి సక్సెస్ అందుతుందని, ఇందులో ఏమోషన్ కూడా ఉందని ఈ సినిమాకు బాలయ్య పర్ఫెక్ట్ అని తెలిపాడు.

 Complete Research On Agora Characters It Took A Month For That Song Thaman-అఘోర పాత్రలపై పూర్తి రీసెర్చ్ చేశా.. ఆ పాట కోసం నెల సమయం పట్టింది.. థమన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Agora, Music Director, Research, Song, Thaman-Movie

ఇక ఈ సినిమాలో అఘోర పాత్రలపై పూర్తిగా రీసెర్చ్ చేశానని తెలిపాడు.పాత్రలకు తగ్గట్టుగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెట్టామని.అది చాలా అద్భుతంగా వచ్చిందని తెలిపాడు.

ఈ సినిమాలో టైటిల్ సాంగ్ విని బాలయ్య మెచ్చుకున్నాడని తెలిపాడు.ఇప్పటి వరకూ తాను చేసిన పనిలో ఇదే బెస్ట్ అని తెలిపాడు తమన్.

ఇందులో బోరు కొట్టే సీన్స్ లేవని.ఈ సినిమాలో ఉండే ఫైర్ లెవెల్ వేరని తెలిపాడు.

ఈ సినిమాలో సింగర్ లు 120 మంది వరకు ఉన్నారని.ఇందులో ఉండే అఘోర పాత్రల ఎంట్రీ బాగా హైలే ట్ గా ఉంటుందని తెలిపాడు.

ఈ సినిమాలో టైటిల్ సాంగ్ కంపోజ్ చేసేందుకు దాదాపు నెల సమయం పట్టిందని తెలిపాడు.ఈ పాట ఒక గొప్ప సన్నివేశం తర్వాత వస్తుందట.

ఇక తనకు ఇంత గొప్ప అవకాశం అందినందుకు సిని బృందానికి థాంక్స్ చెప్పుకున్నాడు.

#Agora #Music #Thaman #Research

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube