శ్రీకాకుళం లో సంపూర్ణ లాక్ డౌన్...ఎందుకంటే.?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఏపీ లో కూడా కరోనా వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతుంది.రోజు రోజుకు ఏపీ లో నిర్వహిస్తున్న టెస్ట్ ల కారణంగా అక్కడ కేసుల సంఖ్య మరింత పెరిగిపోతుంది.

 Coronavirus Crisis Complete Lockdown In Srikakulam District, Coronavirus , Srika-TeluguStop.com

దీనితో ఆ రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.టెస్టుల సంఖ్య పెరిగే కొలది కేసులు కూడా విపరీతంగా బయటపడుతున్నాయి.

దీనితో తాజాగా శ్రీకాకుళం జిల్లా లో కూడా కేసుల సంఖ్య పెరగడం తో ఆ జిల్లా వ్యాప్తంగా 24 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.

గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు వంటి నగరాలతో పాటు గ్రామాల్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆయా జిల్లాల్లో అధికారులు మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు.

ఇప్పుడు ఇదే కోవలో తాజాగా శ్రీకాకుళంలో జిల్లా యంత్రాంగం కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి 24 గంటల పాటు సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతుంది అని అక్కడి అధికారులు ప్రకటించారు.వైద్య సేవలు, మెడికల్ షాపులు మినహా మిగతా అన్నీ కూడా మూసి ఉంటాయి.

అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి రాకూడదని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.శ్రీకాకుళం జిల్లా లో ఒక్క రోజులోనే 5 గురు కరోనా తో మరణించడం తో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

దీనితో ఈ రోజు ఉదయం నుంచి అక్కడ 24 గంటల పాటు ఈ లాక్ డౌన్ అమలుజరగనుంది.ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రజలందరూ ఈ లాక్ డౌన్‌కు సహకరించాలంటూ అధికారులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube