బిగ్ బాస్ మీద యుద్ధ చేస్తున్న ఆ ఇద్దరు! వదిలేలా లేరుగా  

Complaints To National Commission For Women Over Bigg Boss-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 మరో కొద్ది రోజులలో మొదలు కాబోతుంది.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే వారు ఎవరు అనే విషయాన్ని నిర్వాహకులు ఫైనల్ చేసేసారు.గత రెండు సీజన్స్ కంటే భిన్నంగా ఈ సారి బిగ్ బాస్ లో కాస్తా పెద్ద సెలబ్రిటీలని కూడా నిర్వాహకులు తీసుకున్నారు.అలాగే ఈ సీజన్ 3 కోసం కింగ్ నాగార్జున కూడా సిద్ధం అవుతున్నాడు.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ మీద యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసారు..

Complaints To National Commission For Women Over Bigg Boss--Complaints To National Commission For Women Over Bigg Boss-

బిగ్ బాస్ మాటున కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, తమని లైంగికంగా వేధించడం జరిగిందని సంచలన ఆరోపణలు చేసి మీడియా ముందుకి రావడంతో పాటు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.

ఇక ఈ ఇష్యూ సీరియస్ కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు హైకోర్ట్ ని ఆశ్రయించి షో నిర్వహణకి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుంది.అయితే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా మాత్రం బిగ్ బాస్ మీద తమ వైట్ ని మరింత ఉద్రుతం చేసి, ఎలా అయిన ఆ షోని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు.

దీనికోసం వాళ్ళు ఇద్దరు ఏకంగా ఢిల్లీ వెళ్లి విమెన్ రైట్స్ కమిషన్ ని ఆశ్రయించారు.బిగ్ బాస్ షో మహిళల హక్కులకి భంగం కలిగించే విధంగా ఉందని, అలాగే మహిళలని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయడంతో పాటు, లైంగిక వేధింపులు ఎదురైనట్లు ఫిర్యాదు చేసారు.దీనిపై విమెన్ రైట్స్ కమిషన్ పోలీసులని వివరణ కోరినట్లు తెలుస్తుంది.

అయితే నటి హేమ మాత్రం ఈ ఇష్యూ అంతా ఏదో కావాలని చేస్తున్నారు అని తీసి పారేసింది.ఎప్పుడో నెలరోజుల క్రితం జరిగిన వ్యవహారం తీసుకొచ్చి ఇప్పుడు ఎంపిక కాలేదని మీడియా ముందుకొచ్చి రచ్చ చేయడం అంతా కేవలం ప్రచారం కోసమే అని విమర్శించింది.