కాంగ్రెస్ లో మళ్లీ మొదలు ! ' ప్రజా దర్బార్ ' పై ఫిర్యాదులు ?

తెలంగాణ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నా, కాంగ్రెస్ నేతలో మాత్రం ఐక్యత కనిపించడం లేదు.ఎప్పుడూ గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ అంతిమంగా పార్టీకి నష్టం చేకూర్చుతూ వస్తున్నారు.

 Complaints Of Superiority Over Telangana Congress President Revanth Reddy, Revan-TeluguStop.com

గతంలో సీనియర్ నాయకుల మధ్య విభేదాలు ఎక్కువగా కనిపించాయి.ఆ తరువాత రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి అధిష్టానం కట్ట పెడుతోంది అనే వార్తలు వస్తున్న సమయంలోనే సీనియర్ నాయకులంతా ఈ గ్రూపు విభేదాలను పక్కనపెట్టి రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా అనేక ప్రయత్నాలు చేశారు.

అయినా చివరకు అధిష్టానం ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది.ఇదిలా ఉంటే ఏదో ఒక అంశంపై కాంగ్రెస్ సీనియర్లు ఫిర్యాదులు చేస్తూనే వస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ అధిష్టానానికి ఈమెయిల్ ద్వారా .

రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇంతకీ ఈ ఫిర్యాదులు కారణం ఏమిటంటే ఫేస్ బుక్ లో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ప్రజా దర్బార్ లో చేరండి రేవంత్ కు మద్దతు పలకండి అనే పోస్టులు సదరు ఫేస్ బుక్ పేజీల్లో కనిపిస్తుండటం సీనియర్లు మండిపడుతున్నారు.రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు మళ్ళీ ఈ ఫేస్ బుక్ లో పోస్ట్ లు ఏంటని కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు.

రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు ఆయన పేరుతో కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు పుట్టుకొచ్చాయి.కాంగ్రెస్ సీనియర్లే లక్ష్యంగా సదరు ఖాతాల నుంచి వారిని విమర్శిస్తూ పోస్టులు పెట్టే వారు.
   

Telugu Congress, Pcc, Rahul Gandhi, Revanth Reddy, Telangana-Telugu Political Ne

దీనిపై అప్పట్లోనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటివారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్పుడే ఆ పోస్టులకు తనకు సంబంధం లేదు అంటూ రేవంత్ వివరణ ఇచ్చారు.మళ్లీ ఇప్పుడు అవే ఖాతాల నుంచి రేవంత్ కు మద్దతు పలకాలి అంటూ పోస్టులు వస్తుండడంతో, దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో, ఇటీవల ఢిల్లీ కి వెళ్ళిన రేవంత్ ను  ఈ విషయంపై అధిష్టానం వివరణ కోరినట్టు సమాచారం.దీంతో ఆ ఫిర్యాదు చేసింది ఎవరు అనే విషయం రేవంత్ రెడ్డి ఆరాతీయగా, పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి అని చేరడంతో,  నేరుగా హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఫేస్ బుక్ లో వస్తున్న పోస్టింగ్ లకు,  ఆ అకౌంట్స్ కు తనకు సంబంధం లేదు అంటూ ఆయన వివరణ ఇచ్చారట.

అంతేకాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తోనూ దీనిపై ప్రకటన రేవంత్ రెడ్డి చేయించారు.ప్రస్తుతం ఈ వ్యవహారంపై కాంగ్రెస్ లో పెద్ద దుమారమే రేగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube