బుల్ బుల్... బాలయ్యపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు !  

హిందూపురం ఎమ్యెల్యే ..నటుడు బాలకృష్ణ రాజకీయ నాయకుడికంటే పొలిటికల్ కమెడియన్ గా బాగా ఫేమస్ అయిపోతున్నారు. ఆయన నోటి నుంచి ఏం పదాలు వస్తున్నాయో… ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడేసి వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో ఉంటున్నాడు. ఇంత ఘనమైన బ్యాగ్రౌండ్ ఉన్న బాలయ్యకు టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పచెప్పింది. ఇక చూస్కోండి… ఆయన ఏమి ఉపన్యాసం చేస్తారో ఎవరికి తెలియడంలేదు. ఆ మద్య ప్రధాని మోదీని నోటికి వచ్చినట్లు దూషిస్తూ ప్రసంగించారు.

Complaint To The Election Commission Over Balakrishna-

Complaint To The Election Commission Over Balakrishna

తాజాగా ఐటి స్పెల్లింగ్ ఏమిటో తెలంగాణ వాళ్లకు తెలియదాని… .దానిని చంద్రబాబే నేర్పారంటూ గొప్పగా చెప్పారు. దీనిపై తెలంగాణ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసింది.’ మొన్నటి దాకా ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు చంద్రబాబు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని” బాలయ్య వ్యాఖ్యానించడాన్ని ఈ సంఘం తప్పుపడుతోంది. ఇక ఇదొక్కటే కాదు హిందూ సితా హమారా అంటూ బుల్ బుల్ అంటూ బాలయ్య తడబడడాన్ని సోషల్ మీడియాలో కామెడీ జోడించి మరీ ట్రోల్ చేస్తున్నారు.