నిర్మాతని బీర్ బాటిల్ తో కొట్టిన హీరోయిన్  

Complaint Filed Against Actress Sanjana Galrani - Telugu Actress Sanjana Galrani, Bangalore, Complaint Filed, Tollywood

హీరోయిన్ సంజనా గల్రాని అంటే తెలుగు ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోవచ్చు.కాని బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా నటించిన అమ్మాయి అంటే గుర్తుపడతారు.

Complaint Filed Against Actress Sanjana Galrani

కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్ గా ఎదిగి తెలుగులో కూడా ఓ వెలుగు వెలిగిపోదామని వచ్చిన ఈ భామకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.ఏదో చిన్న చిన్న సినిమాలు, చిన్న చిన్న పాత్రలకి పరిమితం అయిపొయింది.

ప్రస్తుతం తెలుగులో ఈటీవీలో ప్రసారం అవుతున్న స్వర్నఖడ్గం సీరియల్ లో ఈ భామ నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ సినిమాల కంటే వివాదాలతో మీడియాలో హడావిడి చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ భామ ఓ బాలీవుడ్ నిర్మాతని బీర్ బోటిల్ తో దాడి చేసిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది.

బెంగళూరు లోని రిచ్ మాండ్ టౌన్ ప్రాంతంలో ఉన్న ఒక స్టార్ హోటల్లో బాలీవుడ్ నిర్మాత వందనా జైన్ పై మద్యం బాటిల్ విసిరేసి దాడి చేసింది.

హోటల్ లో వారి మధ్య ఏదో గొడవ జరగడంతో ఆవేశం తట్టుకోలేక సంజన వందనా జైన్ మీద దాడి చేసింది.దీనిపై ఆమె బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈ గొడవపై సంజన స్పందించింది.తమ ఇద్దరి మధ్య చిన్న గొడవే జరిగిందని అది అక్కడే సెటిల్ చేసేసుకున్నామని, అయితే ఆమె తన మీద అలా ఎందుకు ఫిర్యాదు ఫిర్యాదు చేసింది అనేది తెలియదని పేర్కొంది.

అదే సమయంలో సంబంధం లేకుండా వందనా జైన్ మీద ఆరోపణలు చేసింది.ఆమె దగ్గర 200 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుకోవాలని చెప్పుకొచ్చింది.

అయితే దాడి విషయం మాత్రం మాట దాటవేసే ప్రయత్నం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Complaint Filed Against Actress Sanjana Galrani Related Telugu News,Photos/Pics,Images..