కత్రినా, విక్కీ పెళ్లిపై వివాదం.. కేసు పెట్టిన స్థానికులు!

Complaint Filed Against Katrina Kaif And Vicky Kaushal In Sawai Madhopur For This Reason

ప్రస్తుతం బాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది కత్రినా కైఫ్ వివాహం అనే చెప్పాలి.కత్రినా కైఫ్ తన ప్రియుడు విక్కీ కౌశల్ ఎప్పటి నుండో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

 Complaint Filed Against Katrina Kaif And Vicky Kaushal In Sawai Madhopur For This Reason-TeluguStop.com

ఇక ఇన్ని రోజులకు ఈ బాలీవుడ్ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నారు.వీరిద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం అయితే జరుగుతుంది.

ఇక డిసెంబర్ 12న వీరు వివాహం చేసుకుంటున్నట్టు టాక్ బయటకు వచ్చింది.వీరిద్దరిలో ఒక్కరు కూడా వీరి వివాహం పై నోరు మెదపక పోయిన సన్నిహితుల ద్వారా విషయం బయటకు వచ్చింది.

 Complaint Filed Against Katrina Kaif And Vicky Kaushal In Sawai Madhopur For This Reason-కత్రినా, విక్కీ పెళ్లిపై వివాదం.. కేసు పెట్టిన స్థానికులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాజస్థాన్ లోని సవాయ్ మధోపూర్ జిల్లా లోని 1వ శతాబ్దపు ప్యాలెస్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా లో ఈ వివాహ వేడుక చేసుకుంటున్నారని సమాచారం.

అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్యనే జరగబోతున్న ఈ పెళ్ళికి బాలీవుడ్ లో కొద్దీ మందికి మాత్రమే ఆహ్వానం అందిస్తున్నట్టు సమాచారం.

ఇక ఇక్కడి వరకు బాగానే ఉన్న కూడా ఇప్పుడు వీరి పెళ్ళి వేడుకలకు స్థానికులు అడ్డంకిగా మారారు.వీరికి పెద్ద షాక్ తగిలినట్టు తెలుస్తుంది.

కత్రినా, విక్కీ కౌశల్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Telugu Complaint Filed, Complaintfiled, Katrina Vicky, Katrinavicky, Katrina Kaif, Senses Fort, Vicky Kaushal-Movie

రాజస్థాన్ లోని ప్రఖ్యాత చౌత్ మాత మందిరం ను వీరి పెళ్లి కోసం మూసివేశారంట.నిత్యం ఎంతో మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించు కుంటారట.అయితే వీరి పెళ్లి చేసే నిర్వాహకులు గత వారం రోజులుగా ఈ మందిరాన్ని మూసి వేసారట.

దీంతో భక్తులకు ఇబ్బంది కారణంగా వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.మందిరానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు వారెవరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Complaint Filed, Complaintfiled, Katrina Vicky, Katrinavicky, Katrina Kaif, Senses Fort, Vicky Kaushal-Movie

పెళ్లి కోసం గుడిని మూసివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.వీరిద్దరి వివాహం భద్రతా నియమాల మధ్య జరుగుతుండడంతో మూసి వేయాల్సి వచ్చిందని ఈవెంట్ నిర్వాహకులు చెబుతున్నారు.మరి ఈ విషయంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

#ComplaintFiled #Senses Fort #Vicky Kaushal #Katrina Vicky #Complaint Filed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube